కరోనా వ్యాప్తిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాఠోడ్ విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరోనా కట్టడి చర్యలపై జిల్లా కలెక్టర్లు, వైద్య శాఖ అధికారులతో హన్మకొండలోని నందన గార్డెన్స్‌లో సమీక్షించారు. లాక్డౌన్ నిబంధనలు పాటించాలని... గుంపులు గుంపులుగా తిరిగడం పూర్తిగా మానుకోవాలని పేర్కొన్నారు. వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడానికి ప్రయత్నిస్తున్న ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక్క పాజిటివ్ కేసు రాకపోవడం అదృష్టమని...అయినా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని మంత్రులు సూచించారు. కరోనా లక్షణాలు ఉన్నవారితో సన్నిహితంగా ఉన్నా... వైరస్ లక్షణాలు కనిపించినా వెంటనే అధికారులను సంప్రదించాలని కోరారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వలస కూలీల ఇక్కట్లు పడకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఇవీ చూడండి: కలిసి కట్టుగా ఒకే జట్టుగా కరోనాపై జీ-20 పోరు