ETV Bharat / state

సింగరేణి నిధుల దుర్వినియోగంపై విచారణకు సిద్ధమా..?: రేవంత్​రెడ్డి - రేవంత్​రెడ్డి పాదయాత్రకు 4 రోజుల విరామం

Revanth reddy padayatra in Bhupalpally: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భూకబ్జాలు, సింగరేణి నిధుల దుర్వినియోగంపై విచారణకు సిద్ధమా అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. వేల కోట్ల ఆస్తులు సంపాదించి కేసీఆర్‌, ఆయన కుటుంబం విలాసవంతమైన జీవితాలు గడుపుతున్నారని ఆరోపించారు. హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్రలో భాగంగా భూపాలపల్లిలో పాదయాత్ర చేసిన రేవంత్‌రెడ్డి ప్రజావ్యతిరేక ప్రభుత్వం పోయి పేదల సర్కారు రావాల్సిన అవసరం ఉందన్నారు.

RevanthReddy Hath Se Hath Jodo Yatra
RevanthReddy Hath Se Hath Jodo Yatra
author img

By

Published : Feb 23, 2023, 7:11 AM IST

సింగరేణి నిధుల దుర్వినియోగంపై విచారణకు సిద్ధమా..?: రేవంత్​రెడ్డి

Revanth reddy padayatra in Bhupalpally: కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్​రెడ్డి 'హాథ్‌సే హాథ్‌' జోడో యాత్ర 14వ రోజు భూపాలపల్లి జిల్లాలో కొనసాగింది. చల్లగరిగ, జూకల్, తిరుమలాపూర్, వెంకట్రావ్‌పల్లి, చిట్యాల వరకూ యాత్ర సాగింది. చిట్యాలలో మహిళలతో రేవంత్ మాటముచ్చట నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ని గెలిపించి, మహిళా శక్తిని చాటాలని ఈ సందర్భంగా రేవంత్‌ వాళ్లకి పిలుపునిచ్చారు.

Congress Hath Se Hath Jodo Yatra in Bhupalpally : మహిళలకు మంత్రివర్గంలో చోటు కల్పించకుండా కేసీఆర్ వారిని అవమానించారన్న రేవంత్.. కాంగ్రెస్ సర్కార్‌లో నలుగురు మహిళలకు మంత్రి పదవులు ఇచ్చే బాధ్యత తమదని చెప్పారు. ఏలేటి రాయయ్యపల్లి, నవాబుపేట మీదుగా మొగుళ్లపల్లి వరకూ యాత్ర నిర్వహించి, బస్టాండ్ కూడలిలో జరిగిన బహిరంగ సభలో రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. కేసీఆర్‌ సర్కార్‌ తీరుపై విమర్శలు గుప్పించిన రేవంత్‌రెడ్డి ఆస్తులు పెంచుకోవటం తప్పితే ప్రజలకు చేసిందేంటని ప్రశ్నించారు.

Revanth Reddy comments on BRS leaders: కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని, ఆయన కుటుంబసభ్యులు, బంధువులు మంత్రులు కావాలని ఏ నక్సలైట్ల ఎజెండాలో ఉందన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు చేస్తున్న భూఆక్రమణలు, సింగరేణి నిధుల దుర్వినియోగంపై చర్చకు సిద్ధమా అని రేవంత్‌రెడ్డి సవాల్‌ విసిరారు. కాంగ్రెస్‌ గుర్తుపై గెలిచి, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు కార్యకర్తల ఉసురు తగులుతుందన్నారు.

ప్రజావ్యతిరేక ప్రభుత్వం పోయి, పేదల ప్రభుత్వమైన ఇందిరమ్మ రాజ్యం రావాలని రేవంత్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇళ్లు కట్టుకునే ప్రతీ పేదవాడికి రూ.5 లక్షలు అందిస్తామని, రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. చత్తీస్‌గఢ్‌లో ఏఐసీసీ ప్లీనరీ ఉన్నందున రేవంత్‌రెడ్డి పాదయాత్రకు 4 రోజుల విరామం ప్రకటించారు. సోమవారం హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గంలో హాథ్‌సే హాథ్‌ జోడో యాత్ర ప్రారంభం కానుంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.