Record price for Red chilli in Telangana :ఎర్ర బంగారంగా పిలిచే మిరప.... బంగారం కంటే... అధికంగా ధర పలుకుతోంది. శుక్రవారం వరంగల్ ఎనుమాముల మార్కెట్లో.... దేశీ మిర్చిలో టమాటా రకానికి క్వింటా 80 వేల వంద రూపాయల ధర పలికింది. ఖమ్మం నుంచి వచ్చిన రైతు....ఈ ధరను కైవసం చేసుకున్నాడు. గతేడాది 90 వేలు పలికినా...ఈ సీజన్‌లో కొత్త మిర్చికి ఈ స్థాయి ధర రావడం ఇదే తొలిసారి.
pests threat to red chilli crop : వండర్ హాట్ రకానికి 37 వేలు, తేజ రకానికి 20 వేలు, US 341 రకానికి 26 వేల రూపాయల ధర క్వింటాకు పలుకుతోంది. నాణ్యతలో పేరెన్నిక గన్నది కావటం, ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఇతర రాష్ట్రాల్లో టమాటా రకానికి డిమాండ్ ఉండటంతో... అధిక ధర నమోదవుతోంది. మార్కెట్‌కు వచ్చే మిర్చి తేమ లేకుండా చూసుకుంటే... మరింత ధర వస్తుందని మార్కెట్ అధికారులు సూచిస్తున్నారు.
"టమాట రకం మిర్చికి రూ.80వేల రికార్డు ధర పలికింది. ఈ రకం ఎక్కువగా పచ్చళ్లు పెట్టడానికి ఉపయోగిస్తారు. ఈ పచ్చళ్లు విదేశాలకు ఎక్స్‌పోర్ట్ అవుతాయి. ఈ మిర్చి ఈ ఏడాది తక్కువగా పండింది. అందుకే డిమాండ్ ఎక్కువగా ఉంది." - రాహుల్, ఎనుమాముల మార్కెట్ కార్యదర్శి
pests threat to red chilli in telangana : మార్కెట్లో మంచి ధర ఉందని సంతోష పడాల్సిన రైతులకు... పంటలకు ఆశిస్తున్న తెగుళ్లు.....కంటి మీద కనుకు లేకుండా చేస్తున్నాయి. నల్ల తామర , నల్లి తెగుళ్లు మళ్లీ విజృంభిస్తున్నాయి. పూత, పింద రాలిపోవడంతో... కాయలు రావట్లేదు.
వరంగల్ జిల్లా నర్సంపేట పరిసర ప్రాంతాల్లో సాగు చేసే.... టామాటా రకానికి... డిమాండ్ బాగా ఉంటుంది. దాసరిపల్లి, కమ్మపల్లి, చంద్రయ్యపల్లి తదితర ప్రాంతాల్లో తేజ, చపాట రకం మిర్చి అధికంగా సాగు చేస్తారు. గతేడాది తెగుళ్లకు తోడు ప్రకృతి వైపరీత్యాలతో మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయి అప్పుల్లో కూరుకుపోయారు. ఈ ఏడు కూడా తెగుళ్ల బెడదతో మిరప రైతులు సతమతమవుతున్నారు.
"పంటకు నల్ల తారమ పువ్వు తెగులు పట్టింది. పూత అసలు ఆగడం లేదు. పంట అంతా పాడైపోతుంది. దీనికి సంబంధించి ఏ కంపెనీ కూడా మందు కనుక్కోలేదు. ఈ తెగులు వల్ల పంటంతా పాడైపోతుంది. అన్ని రకాల ఎరువుల మందులు ప్రయత్నించాం. ఎరువుల కోసం లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నాం. అయినా పురుగు పోవడం లేదు. పూత ఆగడం లేదు.. మొత్తం రాలిపోతుంది. ఇలా అయితే మిర్చి పంట వేయడం కష్టమే." రైతులు
ఇటీవల శాస్త్ర వేత్తల బృందం కొన్ని చోట్ల మిర్చి పంటను పరిశీలించి వెళ్లారు తప్ప...ఎలాంటి సూచనలు చేయలేదు. తెగుళ్ల నివారణకు... రైతులు విపరీతంగా పురుగు మందులు కొట్టడం వల్ల పెట్టబడి తడిసి మోపెడవుతోంది. వారానికి మూడు నాలుగుసార్లు పిచికారి చేసినా అదుపులోకి రావడం లేదని ఆవేదన చెందుతున్నారు.
తెగుళ్లతో పంట దిగుబడి సగానికి సగం తగ్గిపోతోంది. ఫలితంగా రైతులు నష్టాలు చవిచూస్తున్నారు. మిర్చికి ధర బాగానే ఉన్నా..... లాభాలు గడించలేదని దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.