ఆరున్నర సంవత్సరాల్లో తెలంగాణలో ఎంతో అభివృద్ధి జరిగిందని రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతారావు అన్నారు. సీఎం కేసీఆర్ అందిస్తున్న సంక్షేమ ఫలాలు అందరికీ అందేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
అభివృద్ధి దిశగా..
ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా ప్రభుత్వ ఛీప్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా సంక్షేమ ప్రగతియాత్ర రథాన్ని హన్మకొండలో జెండా ఊపి లక్ష్మీకాంతారావు ప్రారంభించారు. రాష్ట్రంలో రెండో అతిపెద్ద నగరం వరంగల్‌ను అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తున్నామని ఎమ్మెల్యే అన్నారు.
వరంగల్‌లో డివిజన్ల వారిగా ఇంటింటికెళ్లి వారికున్న సమస్యలపై దృష్టి సారింస్తాం. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం. ఇందులో భాగంగా లక్ష్మీకాంతారావు ఇంటి నుంచి ప్రజా సంక్షేమ ప్రగతియాత్ర ప్రారంభిస్తున్నాం.
-వినయ్ భాస్కర్, ప్రభుత్వ ఛీప్ విప్
ఇదీ చూడండి: రూ.2508 కోట్ల అదనపు రుణం తీసుకునేందుకు రాష్ట్రానికి అనుమతి