వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో జోరుగా వర్షం కురిసింది. ఆదివారం రాత్రి నుంచి ఓ మోస్తరుగా వర్షం కురుస్తుండగా హన్మకొండలోని ప్రధాన రోడ్లు జలమయమయ్యాయి. పలు చోట్ల మురికి కాలువలు పొంగి పొర్లిపోయాయి. డ్రైనేజీ నీరు రోడ్డుపైకి చేరడం వల్ల వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
అసలే కొవిడ్ భయం... అందులో వర్షం పడుతుండగా ప్రజలెవరూ బయటకు రావడానికి ఇష్టపడలేదు. జిల్లా కేంద్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వాన వల్ల పలు కాలనీల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. అత్యవసరమైన పరిస్థితుల్లో బయటకు వచ్చిన వారంతా గొడుగులు, రెయిన్కోట్లతో పాటు మాస్కులు, గ్లౌజులు ధరించి వెళుతున్నారు.