Rahul Gandhi Telangana Tour Schedule : తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఆ పార్టీ ఆగ్రనేతలు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ నేడు తెలంగాణలో పర్యటించనున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఒక్క రోజులోనే అయిదు అసెంబ్లీ నియోజక వర్గాలల్లో పర్యటించి ప్రచారం చేయనున్నారు. పినపాక, పరకాల, వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్, రాజేంద్ర నగర్లలో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం చేస్తారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి వరకు రాహుల్ గాంధీ ప్రచారం కొనసాగుతోంది. ఈరోజు దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ విమానాశ్రయానికి చేరుకోనున్న రాహుల్.. అక్కడ నుంచి హెలికాప్టర్‌లో మణుగూరుకు చేరుకుంటారు. మధ్యాహ్నాం 12:15 గంటలకు పినపాకలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు.
Congress Election Campaign in Telangana : పినపాక నుంచి హెలికాప్టర్‌లో.. మధ్యాహ్నం 2:00 గంటలకు నర్సంపేటకు చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసగింస్తారు. నర్సంపేట నుంచి రోడ్డు మార్గంలో వరంగల్ ఈస్ట్ చేరుకుంటారు. సాయంత్రం నాలుగు గంటలకు పాదయాత్ర చేస్తారు. వరంగల్ ఈస్ట్ నుంచి వెస్ట్‌లో కూడా ప్రచారం నిర్వహిస్తారు. ఇక్కడ ప్రచారం అనంతరం హెలికాప్టర్‌లో రాహుల్ హైదరాబాద్ చేరుకుని.. అక్కడ నుంచి నేరుగా జయపురకు వెళ్లనున్నారు.
రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఖరారు - ఒకేరోజు ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం
Rahul Gandhi Warangal Tour in November 17th : రాహుల్ గాంధీ పర్యటనకు భారీ ఏర్పాట్లు చేస్తున్నామని మాజీమంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. నేడు నర్సంపేట నియోజకవర్గంలో పర్యటనను ముగించుకొని నేరుగా మామునూరు విమానాశ్రయానికి వస్తారని తెలిపారు. అనంతరం రోడ్డు మార్గంలో వరంగల్ చౌరస్తాకు చేరుకుంటారని తెలిపిన ఆమె.. వరంగల్ చౌరస్తా నుంచి పోచమ్మ మైదాన్ రుద్రమదేవి కూడలి వరకు రాహుల్ గాంధీ పాదయాత్ర ఉంటుందని స్పష్టం చేశారు. అలాగే రుద్రమదేవి కూడలిలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తారని చెప్పారు. రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో రావాలని కొండ సురేఖ కోరారు. అంతకు ముందుగా కొత్తవాడలో కొండా సురేఖ ఇంటింటి ప్రచారం నిర్వహించి.. 23వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.
'నేడు వరంగల్ ఈస్ట్‌లో రాహుల్ గాంధీ పర్యటన ఖరారైంది. ఉదయం నర్సంపేట చూసుకుని.. మామూనూరు విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి రాహుల్ గాంధీ కాన్వాయ్ వరంగల్ చౌరస్తాలో ఆగుతుంది. వరంగల్ చౌరస్తా నుంచి పోచమ్మ మైదన్ సెంటర్ వరకు పాదయాత్ర ఉంటుంది. పోచమ్మ మైదన్ సెంటర్లో రెడీమెడ్ స్టేజీ ఏర్పాటు చేస్తాం. అక్కడ రాహుల్ గాంధీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.' -కొండా సురేఖ, మాజీమంత్రి
Rahul Gandhi Election Campaign in Telangana : రుద్రమదేవి కూడలిలోని సభ అనంతరం.. కార్నర్ మీటింగ్‌లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. వరంగల్ రైతు డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలతో పాటు ఆరు గ్యారెంటీలపై మాట్లాడుతారని కాంగ్రెస్ అభర్యర్థి దొంతి మాధవరెడ్డి స్పష్టం చేశారు. ఏ గ్రామం వెళ్లిన ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారని.. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ రుణం తీర్చుకోవాలని ఎదురు చూస్తున్నారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలవబోతున్నామని దొంతి మాధవరెడ్డి స్పష్టం చేశారు.
నేడు ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌కు ఖర్గే : నేడు ఉదయం 10 గంటలకు బెంగుళూరు నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కి మల్లికార్జున ఖర్గే చేరుకుంటారు. 11 గంటలకు గాంధీభవన్ ఖర్గే చేరుకుని.. 11-12 గంటల మధ్య టీపీసీసీ మేనిఫెస్టో కార్యక్రమంలో పాల్గొననున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు కుత్బుల్లాపూర్ మున్సిపల్ గ్రౌండ్ బహిరంగ సభలో పాల్గొంటారు. రాత్రి హైదరాబాద్‌లోనే ఆయన బస చేయనున్నారు.
కాంగ్రెస్ అగ్రనేతలతో సుడిగాలి ప్రచారాలకు ప్లాన్, ఈ నెల 17న తెలంగాణకు రాహుల్ గాంధీ