మాజీ ప్రధాని పీవీ నరసింహారావు స్మారక అవార్డును ఈ ఏడాది దూరదర్శన్ పూర్వ డైరెక్టర్ పాలకుర్తి మధుసూదనరావుకు అందిస్తున్నట్లు ఆల్ బ్రాహ్మణ అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ప్రకటించింది. పీపీ జయంతి రోజైన జూన్ 28న అందజేస్తున్నట్లు తెలిపింది.
పాలకుర్తి మధుసూదనరావు ఆకాశవాణి, దూరదర్శన్ డైరెక్టర్గా, దక్షిణ భారత దూరదర్శన్ కేంద్రం కన్సల్టెంట్గా పనిచేశారని పేర్కొంది. తితిదేకు చెందిన వేంకటేశ్వర భక్తి ఛానల్ సీఈవోగా పనిచేసినట్లు తెలిపింది.
గత మూడేళ్ల నుంచి పీపీ స్మారక అవార్డులు అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గతంలో ఆచార్య లక్ష్మణమూర్తి, గరికపాటి నరసింహారావు, ఓరుగల్లుకు చెందిన కోవెల సుప్రసన్నాచార్య ఈ అవార్డులు పొందినట్లు ప్రకటించింది.
ఇవీచూడండి: పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలకు ఏర్పాట్లు