వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలో మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే సతీశ్ కుమార్, జడ్పీ ఛైర్మన్ సుధీర్ కుమార్ పీవీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వంగరలోని పీవీ నివాసంలో ప్రధానిగా ఉన్నప్పుడు తీసిన ఛాయాచిత్రాల ప్రదర్శనను తిలకించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో భూసంస్కరణల చట్టాన్ని తీసుకువచ్చారని.. ముందుగా నరసింహారావుకు ఉన్న వందల ఎకరాల భూమిని నిరుపేదలకు పంపిణీ చేశారని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఆర్థిక సరళీకరణ విధానాలు తీసుకువచ్చి దేశ ఆర్థిక అభివృద్ధికి కృషి చేసిన గొప్ప మహనీయుడని కొనియాడారు. తెలంగాణ ప్రాంతం నుంచి ప్రధానమంత్రిగా దేశానికి సేవలు చేసిన పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నానని తెలిపారు.