ETV Bharat / state

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఘనంగా పీవీ శతజయంతి వేడుకలు - warangal district latest news today

మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు శతజయంతి వేడుకలను వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. హన్మకొండలోని జేఎన్​ఎస్​ మైదానంలో ఏర్పాటు చేసిన జయంతి వేడుకల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావుతోపాటు పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

pv narasimha rao centennial celebration in the Warangal district
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఘనంగా పీవీ శతజయంతి వేడుకలు
author img

By

Published : Jun 28, 2020, 2:07 PM IST

హన్మకొండలోని జవరహర్ లాల్​నెహ్రు మైదానంలో పీవీ నర్సింహారావు శతజయంతి వేడుకల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శానన సభ్యులు నరేందర్, దాస్యం వినయ్ భాస్కర్, పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డితోపాటు డాక్టర్ తాటికొండ రాజయ్య హాజరయ్యారు. పీవీ నర్సింహరావు విగ్రహనికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. పీవీ చేసిన సేవలను నేతలు కొనియాడారు.

వరంగల్ నగరానికి పీవీ నర్సింహరావుకు ఉన్న అనుబంధాన్ని మంత్రి దయాకర్ వివరించారు. బహుముఖ ప్రజ్ఞశాలి.. బహుభాషా కొవిదుడు పీవీ అని మంత్రి గుర్తు చేశారు. గత ప్రభుత్వాలు పీవీని గుర్తించలేదని అన్న మంత్రి దయాకర్.. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో శతజయంతి వేడుకలను ఏడాది పాటు ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఘనంగా పీవీ శతజయంతి వేడుకలు

ఇదీ చూడండి : 'నెహ్రూకు సమాంతర వ్యక్తిత్వం కలిగిన గొప్ప వ్యక్తి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.