నూతన వ్యవసాయ బిల్లులకు నిరసనగా రైతులు చేస్తున్న ఆందోళనకు రైల్వే ఉద్యోగులు మద్దతు తెలిపారు. వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట్ రైల్వే జేఏసీ కన్వీనర్ దేవులపల్లి రాఘవేందర్ ఆధ్వర్యంలో స్టేషన్ నుంచి ప్రధాన రహదారి వరకు కాగడాల ప్రదర్శన నిర్వహించారు.
నూతన వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా దేశ రాజధానిలో గత 14 రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా కమీటీల పేరుతో కాలయాపన చేయకుండా... కొత్త చట్టాలను రద్దు చేసి రైతులకు భరోసా కల్పించే విధంగా వ్యవహరించాలని కోరారు. అన్నదాత అలిగిన నాడు మోదీతోపాటు దేశం మొత్తం ఆకలితో అలమటించక తప్పదని హెచ్చరించారు.
ఇదీ చూడండి : 'ప్రపంచానికి టీకా అందించే సత్తా భారత్‌కే ఉంది'