న్యాయం జరగలేదని...
మోశా అలియాస్ బాబు మాలిక అనే యువతితో గత పదేళ్లుగా ప్రేమాయణం నడుపుతున్నాడు. కొన్ని రోజులుగా పెళ్లి చేసుకుందామని బాధితురాలు అడగడంతో మెహం చాటేశాడు. న్యాయం చేయాలని కోరుతూ షీ టీంను ఆశ్రయించినా... నిరాశే ఎదురైంది. విసుగు చెందిన మాలిక... సెల్‌టవర్ ఎక్కి నిరసన తెలిపింది. అన్ని విధాలుగా వాడుకొని ఇప్పుడు వేరే అమ్మాయితో పెళ్లి సంబంధం ఖాయం చేసుకున్నాడని ఆరోపించింది.
పెళ్లే కావాలి..
అమ్మాయిని కిందికి దించేందుకు పోలీసులు, బంధువులు నానా తంటాలు పడ్డారు. అబ్బాయి వచ్చి పెళ్లి చేసుకుంటానని మాటిస్తేనే కిందికి దిగుతానని ఉదయం నుంచి భీష్మించుకు కూర్చుంది. పోలీసుల హామీతో చివరికి తన దీక్ష విరమించింది. యువతి దిగి రావటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఇవీ చూడండి :టోర్నడో మిగిల్చిన విషాదం