ETV Bharat / state

'కేంద్ర నిధులు వాడుకుంటూ రాష్ట్రం చేపట్టినవిగా ప్రచారం' - ఓరుగల్లులో బండి సంజయ్​ ప్రచారం

రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్రం నిధులిస్తే వాటిని పక్కదారి పట్టిస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. కేంద్ర నిధులను వాడుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పనులుగా సీఎం కేసీఆర్‌ ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. హన్మకొండ కేడీసీ మైదానంలో శుక్రవారం రాత్రి ఆయన వరంగల్‌ నగర పాలక సంస్థ ఎన్నికల శంఖారావం పూరించారు. వరంగల్‌ నగర పాలక సంస్థపై కాషాయం జెండాను ఎగురవేస్తామన్నారు.

bandi sanjay visit warangal,  Bandi Sanjay in Warangal Shankaravam
'కేంద్ర నిధులు వాడుకుంటూ రాష్ట్రం చేపట్టినవిగా ప్రచారం'
author img

By

Published : Apr 17, 2021, 5:11 AM IST

గ్రేటర్ వరంగల్​లో కాషాయ జెండా రెపరెపలాడడం ఖాయమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఓరుగల్లులో ఓట్లు అడిగే హక్కు... పోటీ చేసే హక్కు తమకే ఉందని తెలిపారు. కేంద్ర సంక్షేమ పథకాలను ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు వివరించాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. హన్మకొండ కాకతీయ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన పార్టీ శ్రేణుల ఎన్నికల శంఖారావం సభలో సంజయ్ పాల్గొన్నారు. కేంద్ర పథకాలను తమ పథకాలుగా చెప్పుకుంటూ తెరాస నాయకులు పబ్బం గడుపుకుంటున్నారని సంజయ్ విమర్శించారు.

వరంగల్​లో అభివృద్ధి ఏదన్నా ఉంటే అది తమ వల్లేనని అన్నారు. వరంగల్​లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మిస్తామని తామెక్కడా చెప్పలేదని... ఆయన స్పష్టం చేశారు. 2016లోనే రైల్వే ఓవరాలింగ్ యూనిట్​కు స్ధలం ఇచ్చి ఉంటే... 5 వేల మంది నిరుద్యోగులకు ఇప్పటికే ఉపాధి లభించేదని తెలిపారు. కేఎంసీ ఆసుపత్రికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ఇవ్వాల్సిన 30 కోట్లు ఇవ్వకపోవడంతో... ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందట్లేదని వెల్లడించారు.

భద్రకాళీ బండ్​ను కేంద్ర నిధులుతో నిర్మిస్తే... కేటీఆర్ వచ్చి ప్రారంభించారని ఆక్షేపించారు. ఈ ఎన్నికల్లో అక్రమ పద్ధతుల ద్వారా తెరాస నాయకులు గెలిచే ప్రయత్నాలు చేస్తున్నారని.. వాటిని తిప్పికొట్టాలని శ్రేణులకు సూచించారు. తెరాస ద్వంద్వ విధానాలను కమలం సేన సమర్థవంతంగా తిప్పికొట్టాలన్నారు. కేంద్ర నిధులతోనే వరంగల్ అభివృద్ధి చెందిందన్నది వాస్తవమని... దీనిపై చర్చించేందుకు తెరాస నేతలు సిధ్ధమేనా అంటూ సవాల్ విసిరారు. గ్రేటర్ వరంగల్​లో భాజాపాకు పట్టం గడితే... ఓరుగల్లు జిల్లాగా వరంగల్​ను చేయాలంటూ కార్పొరేషన్​లో తీర్మానం చేస్తామని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి : సమాచారం ఇవ్వకుండానే ఎలా కలుస్తారు: సంజయ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.