ETV Bharat / state

ఎన్నిక ప్రచారం ముగిసింది - ప్రలోభాల పర్వం ప్రారంభమైంది - Telangana Polls 2023

Political Parties Distribute Money to Voters in Telangana : రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇక అసలు ఆట ఇప్పుడు మొదలైంది. అదే ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి పార్టీల ప్రలోభాలు. ఈ క్రమంలో ఓటర్లకు డబ్బులు పంచుతూ కొందరు పట్టుపడగా.. మరికొంత మంది నగదును అక్రమంగా తరలిస్తూ పోలీసుల తనిఖీల్లో దొరిపోతున్నారు.

Political Parties Distribute money to Voters
Political Parties Distribute money to Voters in Telangana
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 29, 2023, 10:08 AM IST

Political Parties Distribute Money to Voters in Telangana : రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం 5 గంటలతో ముగిసింది. ఇక అభ్యర్థుల దృష్టి అంతా ఓటర్లను ఏవిధంగా ప్రలోభపెట్టాలో అన్నదాని పైనే. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఓటర్లకు డబ్బులు పంచుతున్నారనే ఫిర్యాదులు పోలీసులకు అందుతున్నాయి. కరీంనగర్​లో ఓటర్​ స్లిప్పులతో పాటు డబ్బు పంచుతున్నారని బీఆర్​ఎస్​, బీజేపీ(BRS vs BJP)ల మధ్య ఘర్షణ జరిగింది. అలాగే హైదరాబాద్​లో పెద్ద ఎత్తున డబ్బులు పంచుతున్నారని వివిధ పార్టీలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు రాష్ట్రంలో నగదు అక్రమ రవాణాను పోలీసులు అడ్డుకున్నారు.

Tension At Karimnagar : కరీంనగర్ శివారు కొత్తపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. ఓటర్ స్లిప్పులతో(Voter Slips) డబ్బు పంచుతున్నారనే సమాచారంతో ఎంపీ బండి సంజయ్ అక్కడికి చేరుకోవడంతో తీవ్రస్థాయిలో బీఆర్​ఎస్​, బీజేపీ కార్యకర్తల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఓటర్ లిస్టు పట్టుకొని ఒక్కొక్కరికి రూ.10 వేలు ఇస్తూ.. డబ్బులు ఇచ్చిన తరవాత ఆ లిస్ట్​లో వారి పేరు వద్ద పెయిడ్ అని రాసుకుంటూ ఇంటింటికీ తిరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని బండి సంజయ్ ఆరోపించారు. పెట్రోలింగ్ వెహికల్స్ ఏమయ్యాయని.. పోలీసులు బీఆర్ఎస్(BRS) తొత్తులుగా మారారని ఆరోపణలు చేయడంతో గులాబీ పార్టీ కార్యకర్తలు గొడవకు దిగారు.

ఒకవైపు బీఆర్​ఎస్​ కార్యకర్తలు మరోవైపు బీజేపీ కార్యకర్తలు పోటాపోటీ ఆందోళన చేయడంతో అక్కడ తీవ్ర ఉద్రికత్త నెలకొంది. గంట సేపటి నుంచి డబ్బులు పంచుతున్నా ఎవరూ పట్టించుకొనే పరిస్థితి లేదని బండి సంజయ్ అసహనం వ్యక్తం చేశారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ పూర్తి నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నప్పటికీ.. కిందిస్థాయి సిబ్బంది మాత్రం బీఆర్ఎస్ తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పోలీసులు బండి సంజయ్‌కు నచ్చజెప్పి కరీంనగర్​కు పంపించారు.

ఎన్నికల వేళ పోలీసుల తనిఖీలు - గుట్టుగా కార్లలో తరలిస్తున్న 3.2 కోట్ల సొత్తు సీజ్

గోషామహల్​లో ఓటర్లకు తాయిలాలు : మరోవైపు గోషామహల్​ బీఆర్​ఎస్​ అభ్యర్థి నందకిషోర్​ నగదును పంపిణీ చేస్తున్నారని అక్కడి​ బీజేపీ అభ్యర్థి రాజాసింగ్​(Rajasingh) ఆరోపించారు. బీఆర్​ఎస్​ కార్యకర్తలు వద్ద రూ.10వేలు నుంచి రూ.20 వేలు నగదు ఉందని.. ఆ నగదును ఓటర్లకు పంపిణీ చేస్తున్నారన్నారు. నందకిషోర్​ వద్ద స్వాధీనం చేసుకున్న పేపర్​లో ఎవరికి ఎంత నగదు ఇవ్వాలనే వివరాలు ఉన్నాయని అన్నారు. ఆ పేపర్​లో ఏముందో దర్యాప్తు చేయాలని హైదరాబాద్​ పోలీస్​ కమిషనర్​తో పాటు ఎన్నికల అధికారులను కోరారు.

రాయదుర్గంలో రూ.1.60 కోట్ల నగదు పట్టివేత : హైదరాబాద్​లోని రాయదుర్గం పోలీస్​ స్టేషన్​ పరిధిలో రూ.1.60 కోట్ల(RS 1.60 Crores Money Seized) నగదును పోలీసులు సీజ్​ చేశారు. ఖాజాగుడాలో పోలీసుల తనిఖీలు చేస్తున్న సమయంలో రెండు కార్లలో నగదును తరలిస్తున్న వ్యక్తుల నుంచి ఈ డబ్బును స్వాధీనం చేసుకున్నారు. ఇలా స్వాధీనం చేసుకున్న నగదు జడ్చర్లకు చెందిన ఓ పార్టీ నేతకు చెందిందిగా పోలీసులు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న సొత్తును ఆదాయపు పన్ను శాఖ వారికి అప్పగించారు.

వరంగల్​లో నోట్ల కట్టలతో దొరికిపోయిన బీఆర్​ఎస్​ నేత : వరంగల్​ జిల్లాలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు సిద్ధంగా ఉన్న నోట్ల కట్టలు బయటపడ్డాయి. వర్ధన్నపేట మండలం బొక్కలగూడెం గ్రామ బీఆర్​ఎస్​ బూత్​ కన్వీనర్​ ఇంట్లో ఫ్లయింగ్​ స్క్వాడ్​ తనిఖీలు చేయగా రూ.7.50 లక్షలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బు ఓటర్లకు పంచడానికి తెచ్చిందిగా పోలీసులు గుర్తించారు.

Congress Caught BRS Leader Distributing Money : హైదరాబాద్​లోని మధురానగర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో బీఆర్​ఎస్​ నేతలు డబ్బులు పంచుతుండగా.. కాంగ్రెస్​ శ్రేణులు రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నారు. జీటీఎస్​ టెంపుల్​ ఛైర్మన్​ చిన్న రమేశ్​ను పోలీసులు అదుపులోకి తీసుకొని.. అతని వద్ద నుంచి రూ.25 వేలును స్వాధీనం చేసుకున్నారు. డబ్బులు పంచుతున్న బీఆర్​ఎస్​ నేతలను అడ్డుకోకుండా పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని.. కాంగ్రెస్(Congress)​ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. వారికి పోటీగా బీఆర్​ఎస్​ నేతలు నినాదాలు చేయడంతో అక్కడకు చేరుకున్న పోలీసులు వారిని అక్కడి నుంచి తరిమివేశారు.

తెలంగాణలో పోలీసుల పటిష్ఠ నిఘా - ఎక్కడికక్కడ తనిఖీలు ముమ్మరం - ఇప్పటివరకు రూ.737 కోట్ల సొత్తు స్వాధీనం

ఉప్పల్​ పరిధిలో పోలీసుల తనిఖీలు, రూ.50 లక్షల నగదు పట్టివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.