ETV Bharat / state

తెలంగాణకు గుడ్ న్యూస్.. 'మెగా టెక్స్​టైల్‍ పార్క్' ప్రకటించిన మోదీ

రాష్ట్రంలో లక్షలాది మంది రైతులకు, చేనేత కార్మికులకు ఉపయోగపడేలా మరో మెగా ప్రాజెక్టును కేంద్రం ప్రకటించింది. వేలాది మంది యువతకు ఉద్యోగాలను అందించే మెగా టెక్స్‌టైల్ పార్కు తెలంగాణలో ఏర్పాటుకానుంది. ప్రధాని మోదీ ఈ మెగా ప్రాజెక్టును ప్రకటించారు. ఆత్మనిర్భర భారత్ కార్యక్రమంలో భాగంగా జౌళి రంగంలో భారత్‌ను ప్రపంచంలోనే అగ్రగామిగా నిలపాలన్న ఉద్దేశంతో ఈ పథకానికి కేంద్రం శ్రీకారం చుట్టింది.

pm greenlights to 7 mega textile parks  to be set up in 7 states
7రాష్ట్రాలలో టెక్స్​టైల్ పార్కులకు పచ్చజెండా ఊపిన కేంద్రం
author img

By

Published : Mar 18, 2023, 7:43 AM IST

చేనేత కార్మికులకు, రైతులకు కేంద్రం శుభవార్త తెలిపింది. రాష్ట్రంలో ఎంతో మందికి కర్షక, కార్మికులకు ఉపయోగపడేలా మెగా ప్రాజెక్టును కేంద్రం ప్రారంభించబోతుంది. మెగా టెక్స్​టైల్ పార్కును తెలంగాణలో ఏర్పాటు చేసి వేలాది మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలను కల్పిచబోతుంది. జౌళి రంగంలో భారత్​ను మొదటి స్థానంలో నిలపడానికి, ప్రపంచంలోనే అగ్రగామిగా భారత్​ను నిలపడానికి ఆత్మనిర్భర భారత్ కార్యక్రమంలో భాగంగా కేంద్రం ఈ పథకాన్ని ప్రారంభించబోతుంది.

తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం మెగా టెక్స్​టైల్​ పార్క్​ను ప్రకటించింది. జౌళీ రంగంలో అభివృద్ధి దిశగా అడుగులు వేయడం కోసం కేంద్రం దేశ వ్యాప్తంగా 7మెగా టెక్స్‌టైల్ పార్కులను ఏర్పాటు చేయనుంది. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించబోతున్న మెగా టెక్స్​టైల్ పార్క్ ఫార్మ్ టు ఫైబర్, ఫైబర్ టు ఫ్యాక్టరీ, ఫ్యాక్టరీ టు ఫ్యాషన్, ఫ్యాషన్ టు ఫారిన్ అనే ‘5F’ సూత్రం ఆధారంగా ప్రధానమంత్రి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్‌ రీజియన్ అండ్‌ అపారెల్ పార్క్ పథకాన్ని కేంద్రం రూపొందించింది.

ఈ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా 7 మెగా టెక్స్‌టైల్ పార్కులను ఏర్పాటు చేయాలని నిర్దేశించుకుంది. అందులో భాగంగా తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో 7 మెగా టెక్ట్స్‌టైల్‌ పార్కులను ఏర్పాటు చేయనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణకు ఎంతో లబ్ది చేకూరనుంది. లక్షలాదిమంది రైతులకు, చేనేత కార్మికులకు ఈ ప్రాజెక్ట్ ఎంతో ఉపయోగపడుతుంది. దీంతో పాటు, వేలాదిమంది యువత ఈ పథకం ద్వారా ఉద్యోగాలను పొందటానికి మెగా టెక్స్‌టైల్ పార్కు దోహాదపడనుంది.

పోచంపల్లి ఇక్కత్, గద్వాల్, నారాయణపేట చీరలు, సిద్దిపేట గొల్లభామ, దుర్రీలు వంటి జీఐ(G.I) ట్యాగ్ కలిగిన ఎన్నో చేనేత వస్త్ర ఉత్పత్తులకు ప్రసిద్ధి చెందిన తెలంగాణ రాష్ట్రంలో ఈ మెగా టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు చేసినట్లయితే, రాష్ట్రంలో ఉన్న రైతులకు, చేనేత కార్మికులకు ఎంతో లబ్ధి చేకూరనుంది. ప్రధానమంత్రి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్‌ రీజియన్ అండ్‌ అపారెల్ పార్క్ పథకం ద్వారా టెక్స్‌టైల్ పార్కులో దారం తయారీ నుంచి వస్త్రాలను నేయడం, రంగులు అద్దడం, డిజైన్లు ముద్రించడం, వస్త్రాల తయారీ వరకు అన్ని రకాల పనులు ఒకే ప్రదేశంలో నిర్వహించేలా ఆధునిక మౌలిక సదుపాయాలతో కూడిన భారీ వస్త్ర పరిశ్రమలను నెలకొల్పనుంది.

కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఈ మెగా టెక్స్‌టైల్ పార్కుల వల్ల రవాణా ఖర్చులు భారీగా తగ్గి, భారతీయ జౌళి రంగంలో మరింత పోటీతత్వం పెరుగుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మెగా టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు విషయంలో ప్రత్యేక చొరవను చూపించి, అవసరమైన సహాయసహకారాలను అందించి ప్రాజెక్టు త్వరగా కార్యరూపం దాల్చటానికి కృషి చేయాలని ఆయన కోరారు.

కాకతీయ మెగా టెక్స్​టైల్ పార్క్​కు కేంద్రం పచ్చజెండా

ప్రధాన మంత్రి మెగా మిత్రా(మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్ రీజియన్ మరియు అపెరల్) పార్కుల పథకం కింద ఆమోదం పొందిన ఏడు మెగా టెక్స్‌టైల్ పార్కులలో వరంగల్‌లోని తెలంగాణ కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ (కేఎమ్‌టీపీ) ఒకటి. ఈ పథకం కింద పార్కులు ఏర్పాటు చేయాలని 2021 అక్టోబరు 21న నిర్ణయించి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 2027-28 సంవత్సరాల నాటికి రూ.4,445 కోట్ల రూపాయలు ఖర్చుచేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేఎమ్‌టీపీ కోసం గ్రీన్‌ఫీల్డ్ ప్రధానమంత్రి మిత్రా పార్క్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం కోరిందని, ఇది 1,200 ఎకరాల్లో వస్తోందని, ఇది అమలులోకి వచ్చినప్పుడు 1 లక్షకు పైగా ప్రత్యక్ష ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉందని రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ తెలిపారు. 1,500 కోట్లతో కేఎంటీపీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

ఇవీ చదవండి:

వలస కూలీకి రూ.75 లక్షల జాక్​పాట్.. భయంతో పోలీస్​ స్టేషన్​కు.. చివరకు..

పేపర్ లీకేజీ కేసులో టీఎస్‌పీఎస్‌సీకి సిట్ నివేదిక

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.