ETV Bharat / state

'వైరస్‌ని ఎదుర్కొవడానికి ప్లాస్మా చికిత్స ఉత్తమమైనది' - ప్లాస్మా దాతల సంఘం సేవలు విస్తరణ

వరంగల్‌ వాసుల అవసరాల దృష్ట్యా ప్లాస్మా సేవలను విస్తరిస్తున్నామని ప్లాస్మా దాతల సంఘం అధ్యక్షుడు గుడూరు నారాయణ రెడ్డి తెలిపారు. వైరస్‌ను ఎదుర్కొవడానికి ప్లాస్మా చికిత్స ఉత్తమమైనదని చెప్పారు. ఇప్పటికే వెయ్యి మందికి పైగా కరోనా బాధితులకు ప్లాస్మా అందించామని వెల్లడించారు. ఖమ్మం, కరీంనగర్‌లో విస్తరించే యోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు.

plasma donors association meeting in hanamkonda warangal urban district
'వైరస్‌ని ఎదుర్కొవడానికి ప్లాస్మా చికిత్స ఉత్తమమైనది'
author img

By

Published : Oct 13, 2020, 10:33 AM IST

వరంగల్ నగరంలో ప్లాస్మా సేవలను విస్తరించనున్నామని తెలంగాణ ప్లాస్మా దాతల సంఘం అధ్యక్షుడు గుడూరు నారాయణ రెడ్డి తెలిపారు. కొవిడ్‌ నుంచి కోలుకోవడానికి ప్లాస్మా ఉత్తమమైన చికిత్సా పద్ధతుల్లో ఒకటని ఆయన అన్నారు. కరోనా నేపథ్యంలో వరంగల్ వాసుల అవసరాలను గుర్తించి ప్లాస్మా సేవలను విస్తరిస్తున్నట్లు వరంగల్‌ అర్బన్‌ జిల్లా హన్మకొండలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు.

ఇప్పటికే వెయ్యి మందికి పైగా కరోనా బాధితులకు ప్లాస్మా అందించామని పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం వైరస్‌ వ్యాప్తి మరికొన్ని నెలలు కొనసాగుతుందని, చికిత్స చేయడానికి అవసరమైన మందులు తక్కువగా ఉన్నాయని అన్నారు. ఖమ్మం, కరీంనగర్‌లో టీపీడీఏ సేవలను విస్తరించే యోచనలో ఉన్నట్లు ఆయన తెలిపారు.

ఇదీ చదవండి: వరదలో కిలోన్నర బంగారు నగలు గల్లంతు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.