ETV Bharat / state

జాతీయ రాజకీయాల్లో కేసీఆర్​ నాయకత్వం : వినయ్​ భాస్కర్​ - కేసీఆర్​ చిత్రపటానికి పాలాభిషేకం

సీఎం కేసీఆర్​ జాతీయ రాజకీయాల్లోకి రావాలని దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారని ప్రభుత్వ చీఫ్​ విప్​, వరంగల్​ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్​ భాస్కర్​ అన్నారు. అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేసే నిర్ణయం పట్ల హన్మకొండలోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

people want  KCR to come national politics says warangal west  MLA vinay bhaskar
హన్మకొండలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
author img

By

Published : Jan 25, 2021, 1:55 PM IST

దేశంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగాలంటే కేసీఆర్​ జాతీయ రాజకీయాల్లోకి రావాల్సిందిగా ఛీప్ విప్ వినయభాస్కర్ కోరారు. అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేసే నిర్ణయం పట్ల వరంగల్​ అర్బన్​ జిల్లా హన్మకొండలోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. దేశ ప్రజలు కేసీఆర్​ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని ఆయన అన్నారు.

అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా ముఖ్యమంత్రి ముందుకెళ్తున్నారని తెలిపారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అగ్రవర్ణాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదీ చూడండి : బ్రాహ్మణ సంక్షేమానికి రూ.37 కోట్ల నిధులు మంజూరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.