ETV Bharat / state

ప్రజా సమస్యల పరిష్కారానికే గ్రామాల పర్యటన: ఎమ్మెల్యే చల్లా - వరంగల్‌ బల్దియాలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

ప్రజా సమస్యల పరిష్కారానికే గ్రామాల పర్యటన చేస్తున్నట్లు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పేర్కొన్నారు. రూ.2.50 కోట్లతో నగరంలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. అనంతరం గ్రామాల్లో పర్యటిస్తూ స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

parakala mla, warangal baldia
పరకాల ఎమ్మెల్యే, వరంగల్‌ బల్దియా
author img

By

Published : Jan 21, 2021, 12:38 PM IST

Updated : Jan 21, 2021, 1:42 PM IST

ప్రజా సమస్యల పరిష్కారం దిశగా వరంగల్‌ బల్దియా అధికారులతో పాటు విలీన గ్రామాల్లో పర్యటించడం జరుగుతోందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గురువారం వరంగల్ మహానగర పాలక సంస్థ 5వ డివిజన్ పరిధిలోని రామకృష్ణాపురం, ముస్కులపల్లి, బొల్లికుంట గ్రామాల్లో మేయర్ గుండా ప్రకాష్ రావుతో కలిసి ఎమ్మెల్యే పర్యటించారు. రూ.2.50కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. అనంతరం గ్రామాల్లో పర్యటిస్తూ స్థానికంగా ఉన్న ప్రధాన సమస్యలపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు.

parakala mla, warangal baldia
పరకాల ఎమ్మెల్యే, వరంగల్‌ బల్దియా

ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో అధికారులు అలసత్వం వహించవద్దని ఎమ్మెల్యే సూచించారు. రామకృష్ణాపురంలో రూ.కోటితో అంతర్గత సీసీ రోడ్లు, సైడ్ కాల్వలు నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. గ్రామస్థుల అభ్యర్థన నిమిత్తం వైకుంఠధామం, సీసీ రోడ్లు, కాల్వల నిర్మాణం కోసం ప్రతిపాదనలు తక్షణమే తయారుచేసివ్వాలని అధికారులను ఆదేశించారు. కాలనీల్లో వీధి లైట్లు వెంటనే అమర్చాలని సూచించారు.

ఇదీ చదవండి: కాలువల నుంచి మోటార్లతో నీటిని తోడేస్తున్నారు..!

Last Updated : Jan 21, 2021, 1:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.