వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట, ధర్మసాగర్ మండలంలో నిన్న రాత్రి కురిసిన వర్షం రైతన్నలకు నష్టాన్ని మిగిల్చింది. అక్కరకు రాని చుట్టంలా వచ్చి... పంటను నాశనం చేసి వెళ్లింది. అకాల వర్షంతో వరి రైతులకు గింజ మిగలకుండా పోయింది. పొట్టవిప్పే దశలో ఉన్న వరి పైరు ఒరిగిపోయింది. మరికొన్ని చోట్ల కోత దశలో ఉన్న వరి గింజలు రాలిపోయాయి.
మామిడి రైతులు కూడా ఈ గాలి వాన వల్ల నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఈదురు గాలుల వల్ల పిందెలు, కాపుకు వస్తున్న కాయలు రాలిపోయాయి. అసలే ఈ యేడు పూత తక్కువగా వచ్చిందని మదనపడుతున్న రైతులకు... ఈ గాలి వాన మరింత నష్టం మిగిల్చింది.
ఇవీ చూడండి: హైదరాబాద్లో వర్ష బీభత్సం... ట్రాఫిక్కు అంతరాయం