మహబూబాబాద్ జిల్లాలో సహకార సంఘాల ఎన్నికలకు సంబంధించి సిబ్బందికి సామగ్రి పంపిణీ చేశారు. జిల్లాలోని 18 సహకార సంఘాల్లో 3 ఏకగ్రీవం కాగా... మిగతా 15 సంఘాలకు ఎన్నికలు జరగనున్నాయని జిల్లా ఎన్నికల అధికారి ఇందిర తెలిపారు.
రేపు జరగనున్న పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఇందిర వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 48వేల 350 మంది రైతులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని తెలిపారు.
పోలింగ్ పూర్తయ్యాక మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని ఎన్నికల అధికారి ఇందిర పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో జిల్లాలో 500 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
- ఇదీ చూడండి : ప్రేమించండి... వారి గురించి కూడా ఆలోచించండి