ETV Bharat / state

ఒడిశా నుంచి హైదరాబాద్‌కు ఆక్సిజన్‌ ట్యాంకర్లు

రాష్ట్రంలో ఆక్సిజన్ కొరతను తీర్చేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాల నుంచి తెప్పిస్తున్న ఆక్సిజన్ ట్యాంకర్లు రైల్వే మార్గం ద్వారా రాజధానికి చేరుకుంటున్నాయి. ఒడిశా నుంచి వచ్చిన ఆక్సిజన్‌ రైలు సనత్‌నగర్‌కు చేరుకుంది.

Oxygen tankers
ఒడిశా నుంచి హైదరాబాద్‌కు ఆక్సిజన్‌ ట్యాంకర్లు
author img

By

Published : May 15, 2021, 4:34 AM IST

ప్రభుత్వం ఇతర రాష్ట్రాల నుంచి తెప్పిస్తున్న ఆక్సిజన్ ట్యాంకర్లు... రైల్వే మార్గం ద్వారా హైదరాబాద్‌కు చేరుకుంటున్నాయి. వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట్ రైల్వేస్టేషన్ మీదుగా ఒడిశా నుంచి వచ్చిన ఆక్సిజన్‌ రైలు సనత్‌నగర్‌కు చేరుకుంది.

మరో 6 ఖాళీ ట్యాంకర్లతో సనత్‌నగర్ నుంచి బయలుదేరిన ఆక్సిజన్ రైలు ఒడిశాకు వెళ్లింది. ఈ క్రమంలో ఒడిశాకు వెళ్లే ఖాళీ ట్యాంకర్ల రైలు కాజీపేట్ స్టేషన్‌లో కొంతసేపు ఆగింది. ఈ సమయంలో స్టేషన్‌లో ఉన్నవారు తమ సెల్‌ఫోన్లలో రైలు దృశ్యాలను చిత్రీకరించారు.

ఇదీ చదవండి:పిల్లలకు కరోనా టీకా ఎప్పుడు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.