ETV Bharat / state

వరంగల్​ నిట్​ విద్యార్థులకు ఆన్​ లైన్​లో పాఠాలు

కొవిడ్​ వ్యాప్తి దృష్ట్యా వరంగల్​ జాతీయ సాంకేతిక విద్యా సంస్థ అధ్యాపకులు విద్యార్థులకు ఆన్​ లైన్​ ద్వారా బోధనలు అందుబాటులోకి తెచ్చారు. నిట్​లో 320 మంది వరకూ బోధనా సిబ్బంది ఉండగా.. ఇప్పటికే 70 మంది అధ్యాపకులు మిగిలిపోయిన తరగతులను ఆన్ లైన్​లో బోధించేందుకు శిక్షణ పొంది తరగతులు నిర్వహిస్తున్నారు. వీరు గత 20 రోజుల్లోనే 1200 మంది విద్యార్థులకు ఆన్ లైన్ తరగతులను పూర్తి చేశారు. మిగిలిన అధ్యాపకులు సైతం తమ పాఠ్యాంశాలను ఆన్ లైన్​లో భోదించడంపై శిక్షణ పొందుతున్నారు.

వరంగల్​ నిట్​ విద్యార్థులకు ఆన్​ లైన్​లో పాఠాలు
వరంగల్​ నిట్​ విద్యార్థులకు ఆన్​ లైన్​లో పాఠాలు
author img

By

Published : Apr 24, 2020, 8:51 PM IST

కరోనా కారణంగా వరంగల్ జాతీయ సాంకేతిక విద్యా సంస్థ నిట్ అధ్యాపకులు తమ విద్యార్థులకు ఆన్ లైన్​లో బోధనలను అందుబాటులోకి తీసుకువచ్చారు. వైరస్ వ్యాప్తి దృష్ట్యా ముందస్తు జాగ్రత్తలో భాగంగా మార్చి 22 లాక్ డౌన్ కంటే ముందే నిట్​కి సెలవులు ప్రకటించడం వల్ల విద్యార్థులు తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు. తరగతులు నిలిపివేసే నాటికి వివిధ కోర్సుల విద్యార్థులకు మూడు వారాల తరగతులు మిగిలి ఉన్నాయి.

నిట్​లో 320 మంది వరకూ బోధనా సిబ్బంది ఉండగా.. ఇప్పటికే 70 అధ్యాపకులు మిగిలిపోయిన తరగతులను ఆన్ లైన్​లో బోధించేందుకు శిక్షణ పొంది తరగతులు నిర్వహిస్తున్నారు. వీరు గత 20 రోజుల్లోనే 1200 మంది విద్యార్థులకు ఆన్ లైన్ తరగతులను పూర్తి చేశారు. మిగిలిన అధ్యాపకులు సైతం తమ పాఠ్యాంశాలను ఆన్ లైన్​లో బొధించడంపై శిక్షణ పొందుతున్నారు.

నిట్ సంచాలకుడు ఎన్వీ రమణా రావు వారానికొకసారి నిట్ డీన్​లు, ప్రొఫెసర్​లతో వీడియో కాల్ ద్వారా మాట్లాడుతూ వారికి తగు సూచనలు అందిస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాలు, మారుమూల ప్రాంతాల్లో సిగ్నల్​లు సరిగ్గా లేని కారణంగా కొందరు విద్యార్థులు ఆన్ లైన్ వీడియో కాల్ తరగతులను వినలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటువంటి వారి కోసం ప్రత్యేకంగా ఆన్ లైన్ బోధనలను వీడియో తీసి వాట్సాప్ ద్వారా పంపిస్తున్నట్లు తెలిపారు. దీనితో పాటుగా ఎంటెక్ పరీక్షలను కూడా ఆన్ లైన్​లో నిర్వహించడంపై సాాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు నిట్ అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి: 'వేసవిలో భారత్​ కరోనాను జయించొచ్చు!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.