రేబిస్ వ్యాక్సిన్ వికటించి ఓ మహిళ మృతి చెందిన ఘటన వరంగల్ నగరంలో చోటు చేసుకుంది. దేశాయిపేటకి చెందిన కిరణ్మయి.. రెండోసారి రేబిస్ వ్యాక్సిన్ వేసుకునేందుకు ఎంజీఎం ఆస్పత్రికి వచ్చింది. వైద్యులు వ్యాక్సిన్ ఇచ్చిన క్షణాల్లోనే.. ఆ మహిళ పరిస్థితి ఒక్కసారిగా విషమించింది. వెంటనే ఆసుపత్రి సిబ్బంది హుటాహుటిన అత్యవసర సేవల విభాగానికి తరలించి చికిత్స అందించారు.
రెండు గంటల సేపు చికిత్స నిర్వహించినప్పటికీ.. పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయింది. వ్యాక్సిన్ వికటించడం వల్లే కిరణ్మయి మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.
ఇదీ చూడండి: భాగ్యనగర శివారులో విజృంభిస్తోన్న కరోనా