వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మండలం పంథిని గ్రామంలో లారీ, ద్విచక్రవాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్న పోలిసులు మృత దేహాన్ని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీని ఐనవోలు ఠాణాకు తరలించారు. మృతుడు శిరస్త్రాణం ధరించి ఉంటే బతికేవాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ఇవీ చూడండి: కొందరిలో కొవిడ్ ఉన్నా.. పరీక్షల్లో నెగిటివ్..