జాతీయ సాంకేతిక విద్యాసంస్థ పరిశోధన విద్యార్థి కరోనా వైరస్ వ్యాధి లక్షణాలతో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చేరారు. నేటి పరిశోధన విద్యార్థి ఒక సదస్సులో పాల్గొనేందుకు అమెరికాకు వెళ్లి మార్చి 1న తిరిగి వచ్చాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లాకు చెందిన విద్యార్థి అప్పటి నుంచి తీవ్రమైన జ్వరం దగ్గు జలుబుతో బాధపడుతూ హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. వ్యాధి తగ్గకపోవడం వల్ల ఆస్పత్రి సిబ్బంది వైద్య అధికారులకు విషయాన్ని తెలియజేశారు.
కరోనా వ్యాధి లక్షణాలు ఉన్నాయన్నా అనుమానంతో విద్యార్థి వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలోని ప్రత్యేక విభాగానికి తరలించి రక్తపు నమూనాలను సేకరించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యాధి నిర్ధారణ కాలేదని వైద్యులు పేర్కొన్నారు. రిపోర్టు వస్తే తప్ప ఏమీ చెప్పలేమన్నారు.
ఇదీ చూడండి : తెలంగాణ పెళ్లిలో విదేశీయుల తీన్మార్