ETV Bharat / state

New elegance to Armoor Silk Sarees : ఆర్మూరు చీరలకు అందలం.. అదరహో అనిపించేలా కొత్త సొబగులు - పట్టు చీరలు లేటెస్ట్ డిజైన్స్

New elegance to Armoor Silk Sarees : పట్టు చీరలంటే.. పడతులకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. మరి ఒకనాటి రాజసం ఉట్టిపడే పట్టు చీరలు మార్కెట్లోకి వస్తుంటే...అంతకంటే కావాల్సిందేముంది. ఓరుగల్లు చేనేత వనితలు ఈ ఘనతను సాధిస్తున్నారు. చూస్తే చాలు...కన్ను ఆర్పకుండా చేసే ఆర్మూరు పట్టుచీరలు...నిజాం రాజకుటుంబీకులు ధరించిన హిమ్రూ దస్తులను మగ్గాలపై నేస్తూ...తమ ప్రతిభను చాటుకుంటున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకుని...వైవిధ్యమైన పట్టుచీరలు తయారుచేస్తూ..స్వయం ఉపాధి పొందుతున్నారు.

New elegance to Armoor Silk Sarees , silk sarees 2022
అదరహో అనిపించేలా ఆర్మూరు చీరలకు కొత్త సొబగులు
author img

By

Published : Jan 1, 2022, 7:36 AM IST

Updated : Jan 1, 2022, 11:53 AM IST

New elegance to Armoor Silk Sarees : చీరలెన్ని ఉన్నా... పట్టుచీర ప్రత్యేకతే వేరు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు నిలువుటద్దాలు. యాభై ఏళ్ల కింద వివాహ వేడుకల్లో తళుకులీనిన ఆర్మూరు పట్టుచీరలకు... వరంగల్ మహిళా నేత కార్మికులు కొత్త సొబగులు అద్దుతున్నారు. చక్కటి జరీ పనితనంతో....చూడగానే మనసు దోచే ఆర్మూరు పట్టు చీరలను తయారుచేస్తూ.... తమకు సాటి పోటీ మరొకరు లేరని చాటుతున్నారు. స్వయం ఉపాధి పొందుతూ... యువతులు... తమ కాళ్లపైన తాము నిలబడి.. మిగతావారికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

నేతన్నకు అండగా...

రాష్ట్ర చేనేత జౌళి శాఖ...వరంగల్ హనుమకొండ చేనేత సంఘాలకు మగ్గాలను అందించి...ఆర్మూర్ పట్టుచీరలు, హిమ్రూ దస్తుల తయారీలో శిక్షణ ఇప్పిస్తోంది. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం సూరారం..చేనేత సొసైటీలో మహిళలకు ఆర్మూరు పట్టు చీరలను నేసేందుకు....తర్ఫీదునిచ్చారు. ధర్మవరం నుంచి పట్టు దారాన్ని తీసుకొచ్చి జకార్ట్ విధానంలో...అధునాతన డిజైన్లతో చీరలను అందంగా నేస్తున్నారు. నేతన్నల పిల్లలు అద్భుతంగా చీరలు నేస్తూ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలుస్తున్నారు. .

మహిళల స్పెషల్ ఫోకస్

హనుమకొండ జిల్లా కమలాపూర్ సొసైటీలో గతేడాది నిజాం కాలంలో రాజకుటుంబీకులు ధరించే హిమ్రూ దుస్తులు నేశారు. ఇపుడు ఆర్మూరు చీరలు నేయడంపై మహిళలు దృష్టిసారించారు. అదరహో అనిపించే పట్టు చీరలు తయారు చేస్తున్నారు. ఓరగల్లు వనితల పనితనానికి గర్వపడుతున్నామని సొసైటీ సంఘాల బాధ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మేము పొద్దున లేస్తే కూలికి పోయేవాళ్లం. ఆర్మూర్​లో ట్రైనింగ్ పెట్టారు. మాకు వృత్తి మీద ఉన్న గౌరవంతో ఈ పనిని నేర్చుకుంటున్నాం. మాకు ట్రైనింగ్ ఇవ్వడంపై సంతోషంగా ఉంది. ట్రైనింగ్​లో చీరల గురించి బాగా తెలిసింది. ఏదో షాపుకు పోయి చీరలు కొనేవాళ్లం. కానీ ఏ చీర ఎలాంటిది అనేది ఇప్పుడు బాగా తెలిసింది.

-శిక్షణ పొందిన మహిళలు

ఒక్కోచీర 15 వేల రూపాయల వరకు ధర పలుకుతుంది. టెస్కోకే ఈ చీరలను చేనేత సంఘాలు విక్రయిస్తున్నాయి. వైవిధ్యంగా చేయాలన్న తపనకు కాస్త సృజనాత్మకతను జోడించి.....ఈ ఓరుగల్లు వినితలు మిగతావారికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. కొత్త ఏడాదిలో రామప్ప ఆలయ శిల్పాల అందాలను డిజైన్లుగా మార్చి తీసుకురావాలని యోచిస్తున్నారు.

గతంలో మా నాన్న టై అండ్ టై, బెడ్ షీట్లు వంటివి నేసేవారు. మేము కూడా ఆ పని నేర్చుకున్నాం. మేమూ ఆ వృత్తి కొనసాగిస్తున్నాం. ప్రభుత్వం ఈ ట్రైనింగ్ పెట్టడం సంతోషంగా ఉంది. మా వృత్తిని కొనసాగించాలని అనుకుంటున్నాం. మొదట్లో ఏమీ అర్థం కాలేదు. ఇప్పుడే చీర నేయడం పూర్తిగా వచ్చింది. జాబ్ రాకపోయినా మగ్గం పట్టుకొని చేసేలా పనిని నేర్చుకున్నాం. చీరలు తయారు చేసి... మేమే షాపుకు తరలించడంపై చాలా సంతోషంగా ఉంది.

-శిక్షణ పొందిన యువతులు

అదరహో అనిపించేలా ఆర్మూరు చీరలకు కొత్త సొబగులు

ఇదీ చదవండి : New Year Celebrations Telangana : ఆంక్షల నడమ నవవసంతానికి ఘన స్వాగతం

Last Updated : Jan 1, 2022, 11:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.