ఓరుగల్లు వాసుల ఇలవేల్పు దైవం శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయంలో వసంత నవరాత్రి వేడుకలు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం అమ్మవారికి గులాబి పూలతో పుష్పార్చన చేశారు. భద్రకాళిని దర్శించుకునేందుకు ఆలయ ప్రాంగణంలో భక్తులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు.
ఇదీ చదవండి: కరోనా యోధులకు కొత్త బీమా పాలసీ!