ETV Bharat / state

కన్నుల పండువగా భద్రకాళి అమ్మవారికి తెప్పోత్సవం - Navaratri celebrations at Bhadrakali Temple

భద్రకాళి అమ్మవారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో చివరి రోజైన ఆదివారం.. అమ్మవారు నిజరూప దర్శనం ఇచ్చారు. ఈ సందర్భంగా భద్రకాళి తటాకంలో అమ్మవారికి నిర్వహించిన తెప్పోత్సవం కన్నుల పండువగా సాగింది.

Navaratri celebrations at Bhadrakali Temple
భద్రకాళి అమ్మవారికి కన్నుల పండువగా తెప్పోత్సవం
author img

By

Published : Oct 25, 2020, 10:38 PM IST

ఓరుగల్లు వాసుల ఇలవేల్పు శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి నిజరూప దర్శనం ఇచ్చారు. చివరి రోజైన ఆదివారం అమ్మవారికి హంస వాహనంపై జలక్రీడ నిర్వహించారు.

ఈ సందర్భంగా భద్రకాళి తటాకంలో నిర్వహించిన తెప్పోత్సవం కన్నుల పండువగా సాగింది. ఈ తెప్పోత్సవంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏటా అత్యంత వైభవోపేతంగా జరిగే ఉత్సవాలు.. కరోనా నేపథ్యంలో ఈ సంవత్సరం సాదాసీదాగా నిర్వహించారు.

ఇదీ చూడండి.. రేపటి నుంచి శ్రీవారి సర్వదర్శన టోకెన్ల జారీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.