వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారంలోని కస్తూర్భా గాంధీ కళాశాలకు చెందిన విద్యార్థునులకు రాత్రి భోజనం వికటించింది. 30 మంది అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులకు విరోచనాలు కావడం వల్ల వారిని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అమ్మాయిలకు ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.
వసతి గృహంలో రాత్రి భోజన సమయంలో ఆలుగడ్డ, పచ్చిపులుసు తిన్నామని.. రాత్రి నుంచి అందరికి విరోచనాలు అవుతున్నాయని విద్యార్థినులు పేర్కొన్నారు.
ఇవీ చూడండి : మాటలతో మాయ చేసి.. మంత్రి పేరుతో ముంచేస్తాడు..!