టాలీవుడ్, బాలీవుడ్ తారల ఒక్కరోజు క్రికెట్ పోటీలు ఈనెల 22న వరంగల్లోని జాతీయ సాంకేతిక విద్యాసంస్థలో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా వరంగల్లో పలువురు నటీనటులు సందడిచేశారు. ప్రచారంలో భాగంగా నిట్లో ట్రోఫీ ఆవిష్కరించారు.
క్రిసెంట్ సంస్థ ఆధ్వర్యంలో లోటస్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ సహకారంతో నిట్ మైదానంలో పోటీలు నిర్వహించనున్నారు. దీని ద్వారా వచ్చే ఆదాయాన్ని సామాజిక కార్యక్రమాలకు వినియోగించనున్నట్లు తెలిపారు.
సినీ నటి అక్ష తెలుగులో డైలాగ్ చెప్పి అందరిని ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నారు.