ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. అర్బన్ జిల్లాలో ఒక్కరోజే పది కేసులు నమోదైయ్యాయి. జిల్లాలో ఇప్పటి వరకు ఆరుగురు వైద్యులు కొవిడ్-19 బారిన పడ్డారు. రోగులకు సేవలందించే వైద్యులకు వైరస్ సోకటం వల్ల అందరిలోనూ ఆందోళన వ్యక్తమవుతోంది.
ములుగు జిల్లాలోనూ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. బుధవారం ఒక్కరోజే ఐదుగురు వైద్యులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధరించారు. ఇక జనగామ జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. నిన్న ఒక్కరోజే ఏడు కేసులు నమోదయ్యాయి. జిల్లా కేంద్రంలోని ఎరువుల దుకాణ యజమానికి తొలుత పాజిటివ్ రాగా.... దుకాణంలో పని చేసే నలుగురికి, కుటుంబ సభ్యులు ముగ్గురికి కూడా పాజిటివ్‌గా నమోదైనట్లు వైద్యులు వెల్లడించారు.