ETV Bharat / business

లేటెస్ట్​ మారుతి సుజుకి డిజైర్​ Vs హోండా అమేజ్​ Vs హ్యుందాయ్ ఆరా Vs టాటా టిగోర్​ - వీటిలో ఏది బెస్ట్ ఆప్షన్​? - MARUTI SUZUKI DZIRE TOP RIVALS

అదిరే ఫీచర్లతో మారుతి సుజుకి డిజైర్​ లాంఛ్​ - మార్కెట్లో దీనికున్న టాప్​-3 రైవల్స్ ఇవే!

Maruti Suzuki Dzire
Maruti Suzuki Dzire (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 11, 2024, 4:14 PM IST

Maruti Suzuki Dzire Top Rivals : మీరు రూ.7 లక్షల బడ్జెట్లో మంచి కారు కొనాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. ప్రస్తుతం మార్కెట్లో ఈ బడ్జెట్లో చాలా మంచి ఫీచర్లు, స్పెక్స్​తో, ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లు చాలానే ఉన్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం రండి.

1. Maruti Dzire : మారుతి సుజుకి కంపెనీ నవంబర్​ 11న ఇండియన్ మార్కెట్లో మారుతి డిజైర్​ కారును లాంఛ్ చేసింది. ఈ కారు మొత్తం 7 రంగుల్లో, 4 వేరియంట్లలో లభిస్తుంది.

ఈ సబ్​-ఫోర్​-మీటర్ సెడాన్​ కారు సేఫ్టీపరంగా GNCAP 5 స్టార్ రేటింగ్ పొందింది. కనుక ఫ్యామిలీ కోసం మంచి కారు కొనాలని అనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది.

ఈ మారుతి డిజైర్​ కారులో 1.2 లీటర్​ జెడ్​-సిరీస్​ పెట్రోల్ ఇంజిన్​ అమర్చారు. ఇది 80 bhp పవర్​, 112 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ కారు 5-స్పీడ్​ మాన్యువల్​, ఏఎంటీ గేర్​ బాక్స్ అనుసంధానంతో పనిచేస్తుంది. ఈ కారు సీఎన్​జీ వెర్షన్​లోనూ అందుబాటులో ఉంది. ఈ డిజైర్​ సీఎన్​జీ కారు 68 bhp పవర్​, 102 Nm టార్క్ జనరేట్ చేస్తుంది.

ఈ డిజైర్​ కారులో ముందు భాగంలో ఫ్రెష్ గ్రిల్​, హారిజాంటెల్​ స్లేట్స్​, హెడ్​ ల్యాంప్స్​ ఏర్పాటు చేశారు. అలాగే కారు ముందు, వెనుక భాగాల్లో బంపర్స్​, డ్యూయెల్​-టోన్​ అల్లాయ్ వీల్స్​ అమర్చారు. దీనిలో షార్క్​-ఫిన్ యాంటెన్నా కూడా ఉంటుంది.

డిజైర్​ ఇంటీరియర్​ విషయానికి వస్తే, దీనిలో​ ఎలక్ట్రిక్ సన్​రూఫ్​ ఉంటుంది. ఈ సెగ్మెంట్​లో ఎలక్ట్రిక్​ సన్​రూఫ్ తేవడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. అలాగే ఈ కారులో 9 అంగుళాల టచ్​స్క్రీన్​ ఇన్ఫోటైన్​మెంట్ సిస్టమ్, ఫ్లాట్​-బోటమ్​ స్టీరింగ్ వీల్​, 360-డిగ్రీ కెమెరా, క్రూయిజ్​ కంట్రోల్​, రియర్ ఏసీ వెంట్స్​, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్​ ఉన్నాయి.

మారుతి సుజికి డిజైర్ (ఓల్డ్ మోడల్​)​ 25.7 కి.మీ/లీటర్​ మైలేజ్ ఇస్తుంది. మరి లేటెస్ట్​ మోడల్ ఎంత మైలేజ్ ఇస్తుందో చూడాలి.

Maruti Dzire Price : మార్కెట్లో ఈ మారుతి సుజుకి డిజైర్​ కారు ధర రూ.6.79 లక్షలు - రూ.10.14 లక్షలు (ఎక్స్​-షోరూం) వరకు ఉంటుంది.

2. Honda Amaze : ప్రస్తుతం మార్కెట్లో మారుతి డిజైర్​కు గట్టిపోటీదారుగా హోండా అమేజ్​ కారు ఉంది. డిసెంబర్​లో హోండా అమేజ్​ లేటెస్ట్​ వెర్షన్ కూడా​ లాంఛ్ అయ్యే అవకాశం ఉంది.

హోండా అమేజ్​ కారులో 1199 సీసీ పెట్రోల్​ ఇంజిన్ ఉంటుంది. ఇది 88.5 bhp పవర్​, 110 Nm టార్క్​ జనరేట్ చేస్తుంది. ఇది మాన్యువల్​, ఆటోమేటిక్ ట్రాన్స్​మిషన్​ అనుసంధానంతో పనిచేస్తుంది. ఈ కారు 18.3 - 18.6 కి.మీ/లీటర్​ మైలేజ్ ఇస్తుంది. ఈ కారు మొత్తం 11 వేరియంట్లలో, 5 భిన్నమైన రంగుల్లో లభిస్తుంది. ఈ కారులో 420 లీటర్స్​ బూట్ స్పేస్ ఉంటుంది. కనుక కాస్త ఎక్కువ లగేజ్​ను కూడా సులువుగా పట్టుకెళ్లవచ్చు.

ఈ హోండా అమేజ్​ కారులో 7-అంగుళాల టచ్​స్క్రీన్ ఇన్ఫోటైన్​మెంట్ సిస్టమ్​, ఆటో ఏసీ, క్రూయిజ్ కంట్రోల్​, పెడల్ షిఫ్టర్స్​ (CVT వేరియంట్లలో) ఉంటాయి. ఇక సేఫ్టీ పరంగా చూస్తే, ఈ కారులో డ్యూయెల్ ఫ్రంట్​ ఎయిర్​బ్యాగ్స్​, ఏబీఎస్​ విత్​ ఈబీడీ, రియర్ పార్కింగ్ సెన్సార్స్​, సీట్​ బెల్ట్ రిమైండర్స, ఛైల్డ్ సీట్ యాంకర్, రియర్​ వ్యూ కెమెరా ఉంటాయి.​

Honda Amaze Price : మార్కెట్లో ఈ హోండా అమేజ్ కారు ధర సుమారుగా రూ.7.20 లక్షలు - రూ.9.96 లక్షల వరకు ఉంటుంది.

3. Hyundai Aura : ఇండియన్ మార్కెట్లో మారుతి డిజైర్​కు పోటీగా ఉన్న మరో బెస్ట్ కారు హ్యుందాయ్ ఆరా. ఈ కారులో 1.2 లీటర్​ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 82 bhp పవర్​, 113.8 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఇది 5-స్పీడ్​ మాన్యువల్​, ఆటోమేటిక్​ గేర్​ బాక్స్​ అనుసంధానంతో పనిచేస్తుంది. ఈ కారు 19.4 - 20 కి.మీ/లీటర్​ మైలేజ్ ఇస్తుంది. దీనిలో స్టాండర్డ్​గా 6 ఎయిర్​బ్యాగ్​లు, ఏబీఎస్​ విత్ ఈబీడీ, త్రీ-పాయింట్స్ సీట్​ బెల్ట్స్​, రిమైండర్స్​, రియర్​ పార్కింగ్ సెన్సార్స్​, ఎమెర్జెన్సీ స్టాప్​ సిగ్నల్ ఉంటాయి. అయితే దీనికి NCAP సేఫ్టీ రేటింగ్ లేకపోవడం గమనార్హం. ఈ కారు 8 వేరియంట్లలో, 6 రంగుల్లో లభిస్తుంది.

Hyundai Aura Price : మార్కెట్లో ఈ హ్యుందాయ్ ఆరా కారు ధర రూ.6.49 లక్షలు - రూ.9.05 లక్షల వరకు ఉంటుంది.

4. Tata Tigor : ఈ టాటా టిగోర్​ కారు ఒక ఎంట్రీ లెవెల్​ సెడాన్ కారు. ఇది పెట్రోల్​, సీఎన్​జీ వేరియంట్లలో లభిస్తుంది. దీనిలో ఈవీ వెర్షన్ కూడా ఉంది. ఈ టిగోర్​ కారులో 1199 సీసీ ఇంజిన్​ ఉంటుంది. ఇది 72.41 - 84.48 bhp పవర్​, 95 - 113 Nm టార్క్​ జనరేట్ చేస్తుంది. ఈ కారు​ 19.28 - 19.16 కి.మీ/లీటర్​ మైలేజ్ ఇస్తుంది. ఇది ఆటోమేటిక్​, మాన్యువల్​ ట్రాన్స్​మిషన్​ అనుసంధానంతో పనిచేస్తుంది. ఈ కారు 4 వేరియంట్లలో, 5 ఎక్స్​టీరియర్​ కలర్స్​లో లభిస్తుంది.

ఈ కారుకు గ్లోబల్​ NCAP 4-స్టార్ రేటింగ్ ఉంది. దీనిలో డ్యూయెల్ ఫ్రంట్​ ఎయిర్​బ్యాగ్స్​, ఏబీఎస్​ విత్ ఈబీడీ, రియర్ పార్కింగ్​ కెమెరా, రెయిన్-సెన్సింగ్ వైపర్స్​, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్​, చైల్డ్ సీట్​ యాంకరేజెస్​, రియర్ పార్కింగ్ సెన్సార్స్ ఉంటాయి.

Tata Tigor Price : మార్కెట్లో ఈ టాటా టిగోర్ కారు ధర సుమారుగా రూ.6 లక్షలు - రూ.9.40 లక్షల వరకు ఉంటుంది.

మీ ఫ్యామిలీ కోసం మంచి కారు కొనాలా? రూ.10 లక్షల బడ్జెట్లోని టాప్‌-9 మోడల్స్ ఇవే!

మొదటిసారి కారు కొంటున్నారా?- నో టెన్షన్ గురూ.. వీటితో ఫుల్ క్లారిటీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.