Blood Pressure Control Tips in Telugu: ప్రస్తుతం ప్రపంచాన్ని వేధిస్తున్న అనారోగ్య సమస్యల్లో హైపర్ టెన్షన్ ఒకటి. ఇది బ్రెయిన్ స్ట్రోక్, గుండె పోటు, హార్ట్ పెయిల్యూర్, కిడ్నీ వైఫల్యం లాంటి ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీసి అనేక మంది ప్రాణాలను బలికొంటుంది. దీనిని తగ్గించుకోవడానికి చాలా మంది అనేక మందులు, చికిత్సలు ప్రయత్నిస్తుంటారు. ఇంకా చాలా చిట్కాలు, వ్యాయామాలు చేస్తుంటారు. ఇవే కాకుండా మెట్లు ఎక్కడం, సైక్లింగ్ లాంటి చిన్న ఎక్సర్సైజులతో అధిక రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చని వెల్లడైంది.
యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ (UCL), యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ కలిసి సంయుక్తంగా చేసిన ఓ అధ్యయనంలో ఈ విషయం తేలింది. ఇందులో UCL Surgery & Interventional Science and the Institute of Sport, Exercise & Health ప్రొఫెసర్ Dr. Jo Blodgett పాల్గొన్నారు. కేవలం 5 నిమిషాల పాటు ఇలాంటి చిన్న ఎక్సర్సైజులు చేయడం వల్ల హైపర్ టెన్షన్ సంబంధిత సమస్యలు దూరం చేసి రక్తపోటును అదుపులో ఉంచుతాయని వివరించారు. చాలా సమయం వ్యాయామం చేయలేనివారు సైతం వాకింగ్, సైక్లింగ్ లాంటి యాక్టివిటీలు చేయడం వల్ల కూడా రక్తపోటు సమస్యను తగ్గించుకోవచ్చని అంటున్నారు. 6 రకాల యాక్టివిటీల ఆధారంగా పరిశోధన చేసి ఈ విషయాన్ని తెలిపారు.
- నిద్ర
- కూర్చోవడం
- నిధానంగా నడవడం (నిమిషానికి 100 అడుగుల లోపు నడవడం)
- వేగంగా నడవడం (నిమిషానికి 100 అడుగులకు పైగా నడవడం)
- నిలబడడం
- వ్యాయామం (రన్నింగ్, సైక్లింగ్)
ఐదు దేశాలకు చెందిన సుమారు 14,761 మందిపై ఈ పరిశోధన చేపట్టారు. ప్రతీ వ్యక్తికి ఓ యాక్సిలెరోమీటర్ను పెట్టి 24గంటల పాటు వారి రక్త పోటును పరిశీలించారు. ఇందులో 7 గంటల పాటు నిద్ర, సుమారు 10 గంటల పాటు కూర్చోవడం, 3 గంటలు నిలబడడం, ఒక గంట నిధానంగా నడవడం, ఒక గంట వేగంగా నడవడం, 16 నిమిషాల పాటు రన్నింగ్, సైక్లింగ్ లాంటివి చేయించారు. ఇలా ప్రతి రోజు యాక్టివిటీలు, సమయాన్ని మార్చి రక్తపోటు ప్రభావాన్ని అంచనా వేశారు. ఇందులో 5 నిమిషాల పాటు మెట్లు ఎక్కడం, సైక్లింగ్ లాంటి యాక్టివిటీలు చేయడం వల్ల సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ (SBP) 0.68 mmHg, డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ (DBP) 0.54 mmHg తగ్గినట్లు తేల్చారు. ఇలా 2mmHg (SBP), 1mmHg (DBP) తగ్గడం వల్ల సుమారు 10 శాతం గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం తగ్గుతుందని వివరించారు.
ముఖ్య గమనిక : ఈ వెబ్సైట్లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
చపాతీలు, ఓట్స్ తింటున్నారా? అయితే, మీకు ఈ వ్యాధులన్నీ వచ్చే ఛాన్స్ ఉందట!
వ్యాయామం అంటేనే చిరాకు వస్తుందా? ఈ చిట్కాలు పాటిస్తే రోజూ ఈజీగా చేసేస్తారు!