ETV Bharat / entertainment

రుక్మిణీ వసంత్​ యమా బిజీబిజీ - అన్నీ పాన్ ఇండియా సినిమాలే! - RUKMINI VASANTH UPCOMING MOVIES

బడా హీరోల సినిమాలతో బిజీగా మారిపోయిన కన్నడ భామ రుక్మిణీ వసంత్‌!

Rukmini Vasanth
Rukmini Vasanth (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 11, 2024, 3:49 PM IST

Rukmini Vasanth Upcoming Pan India Movies : స‌ప్త సాగ‌రాలు దాటి చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన కన్నడ నటి రుక్మిణీ వసంత్‌. ఈ చిత్రంలో తన అందం, నటనతో పాటు టాలీవుడ్ యూత్​ ఆడియెన్స్​ మనసులను దోచేసింది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ అమ్మడికి ఇతర భాషాల సినిమాల అవకాశాలు తలుపు తట్టాయి.

దీంతో ప్రస్తుతం కన్నడతో పాటు తెలుగులోనూ వరుస కథలు వింటోందీ భామ. రీసెంట్​గానే ఈ ముద్దుగుమ్మ నటించిన అప్పుడో ఇప్పుడో ఎప్పుడో విడుదలైంది. ఈ చిత్రం అంతగా ఆకట్టుకోలేక పోయినప్పటికీ ఆమె అందానికి మంచి మార్కులే పడ్డాయి. అయితే ఇప్పుడీ భామ చేతిలో అన్నీ బడా సినిమాలే ఉన్నాయి.

రుక్మిణి వసంత్ డైరీ చుస్తే ఆమె నటించనున్న అన్నీ చిత్రాలు స్టార్ హీరోలవే. కాంతారతో నేషనల్ వైడ్​గా ఫేమ్ దక్కించుకున్న కన్నడ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా కాంతార చాఫ్టర్ -1. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ నటిస్తోంది.

NTR Prasant Neel Movie Heroine : దర్శకుడు ప్రశాంత్ నీల్​ - యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబోలో రానున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ఎంటర్​టైనర్​ సినిమాలోనూ రుక్మిణినే నటించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికార ప్రకటన వచ్చే అవకాశముంది. విజయ్​ దేవరకొండతోనూ ఓ సినిమా చేసే అవకాశముందని ఆ మధ్య ప్రచారం సాగింది.

Siva Karthikeyan AR Murugadoss Movie Heroine : ఇక తమిళంలో స్టార్ డైరెక్టర్ AR మురగదాస్ దర్శకత్వంలో శివ కార్తికేయన్ చేయనున్న సినిమాలోనూ రుక్మిణి వసంతనే హీరోయిన్​గా నటిస్తున్నట్లు తెలిసింది. అలా ఈ ముద్దుగున్న అన్ని పాన్ ఇండియా చిత్రాల్లోనే నటించనుండటం విశేషం.

కాగా, బెంగళూరుకు చెందిన ఆర్మీ కుటుంబంలో 1996 అక్టోబర్‌ 10న రుక్మిణీ వసంత్‌ జన్మించింది. రుక్మిణీ తండ్రి కల్నల్‌ వసంత్‌ వేణుగోపాల్‌. రుక్మిణి తల్లి సుభాషిణి భరతనాట్యం డ్యాన్సర్‌. ఆమె వల్లే రుక్మిణీకి సినిమాలపై ఆసక్తి పెరిగిందట. 2019లో విడుదలైన బీర్బల్‌ ట్రైయాలజి చిత్రంతో నటిగా ఎంట్రీ ఇచ్చింది రుక్మిణీ. అదే ఏడాది హిందీలోకి అడుగుపెట్టింది. ఇకపోతే ఈ భామకు చీర కట్టుకోవడం అంటే ఎంతో ఇష్టం.

ఆ బాలీవుడ్​ హీరోయిన్​తో సినిమా - అసలు విషయం బయటపెట్టిన 'కల్కి' నాగ్ అశ్విన్!

'SSMB' బడ్జెట్ రూ.1000కోట్లు- రూ.4వేల కోట్ల కలెక్షన్ పక్కా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.