ETV Bharat / entertainment

కొత్త పోస్టర్​తో 'పుష్ప 2' సర్​ప్రైజ్​ - ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్​ - ALLUARJUN PUSHPA 2 TRAILER UPDATE

'పుష్ప 2' సర్​ప్రైజ్​ ఇదే - ట్రైలర్​ రిలీజ్​ డేట్​ను అఫీషియల్​ ప్రకటించిన మూవీ టీమ్​

Icon Star Allu Arjun  Pushpa 2
Icon Star Allu Arjun Pushpa 2 (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 11, 2024, 4:18 PM IST

Allu arjun Pushpa 2 Trailer Release Date : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ హీరోగా దర్శకుడు సుకుమార్‌ తెరకెక్కిస్తోన్న యాక్షన్‌ థ్రిల్లర్‌ పుష్ప 2 : ది రూల్‌. నేషనల్ క్రష్ రష్మిక హీరోయిన్​గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబరు 5న పాన్‌ ఇండియా స్థాయిలో గ్రాండ్​గా విడుదల కానుంది. దీంతో సినిమా విడుదలకు సమయం దగ్గర పడడంతో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా తాజాగా ట్రైలర్​ విడుదల తేదీని అఫీషియల్​గా ప్రకటించింది మూవీ టీమ్. నవంబర్ 17న సాయంత్రం 6.03 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది. పట్నాలో భారీ ఈవెంట్​ను నిర్వహించి విడుదల చేయనున్నట్లు చెప్పింది. అలానే ఓ స్పెషల్ పోస్టర్​ను కూడా విడుదల చేసింది. ఈ పోస్టర్​లో అల్లు అర్జున్​ పవర్​ ఫుల్ యాక్షన్ అండ్ మాస్​ లుక్​లో గన్​ను భూజాన వేసుకుని సీరియస్​గా కనిపించి ఆకట్టుకున్నారు.

కాగా, 'పుష్ప అంటే ఫ్లవర్‌ అనుకుంటివా ఫైరు' అంటూ వచ్చిన పుష్ప1 ట్రైలర్‌ అప్పట్లో ఎంతటి ట్రెండ్‌ సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అంతకు మించిన స్థాయిలో ట్రైలర్‌ కట్‌ను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

Pushpa 2 Special Song : ఇకపోతే ట్రైలర్‌ మాత్రమే కాదు, ఆ వెంటనే స్పెషల్ సాంగ్‌ లిరికల్‌ వీడియోను కూడా విడుదల చేయాలని మూవీ టీమ్ భావిస్తోందట. సుకుమార్‌ - దేవి శ్రీ కాంబినేషన్‌లో స్పెషల్​ సాంగ్స్ అంటేనే ఎవర్‌ గ్రీన్‌. పుష్పలో కూడా 'ఊ అంటావా మావ' సాంగ్​ కూడా ఓ ఊపు ఊపేసింది. ఇప్పుడు పుష్ప 2 కోసం దానిని మించేలా స్పెషల్​ సాంగ్‌ను సిద్ధం చేస్తున్నారు. హీరోయిన్​ శ్రీలీల ఇందులో ఆడిపాడనున్నట్లు తెలుస్తోంది.

అలానే ఈ పుష్ప 2 పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్ కానున్న సినిమా కావడంతో అందుకు తగినట్లే వివిధ నగరాల్లో ప్రెస్‌ మీట్‌లు, ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌లు చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

రుక్మిణీ వసంత్​ యమా బిజీబిజీ - అన్నీ పాన్ ఇండియా సినిమాలే!

ఆ బాలీవుడ్​ హీరోయిన్​తో సినిమా - అసలు విషయం బయటపెట్టిన 'కల్కి' నాగ్ అశ్విన్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.