ETV Bharat / state

'ప్రధాని మోదీ పాలనలో దేశం సుభిక్షం... ఇంటింటికీ సంక్షేమం' - ధర్మసాగర్​లో భాజపా ఇంటింటికి ప్రచారం

ప్రధాని మోదీ పాలనలో దేశం సుభిక్షంగా ఉందని భాజపా వరంగల్ అర్బన్ జిల్లా కార్యదర్శి వెంకట్​రెడ్డి, మండల అధ్యక్షుడు శ్రీనివాస్​రెడ్డి పేర్కొన్నారు. ధర్మసాగర్ మండల కేంద్రంలో గడపగడపకు మోదీ సందేశం కార్యక్రమం నిర్వహించారు. భాజపా రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన కార్యక్రమాలను వివరిస్తూ.. లేఖల ద్వారా కేంద్ర పథకాలను వివరిచారు.

'ప్రధాని మోదీ పాలనలో దేశం సుభిక్షం'
'ప్రధాని మోదీ పాలనలో దేశం సుభిక్షం'
author img

By

Published : Jun 14, 2020, 7:19 PM IST

Updated : Jun 14, 2020, 7:46 PM IST

వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలో గడపగడపకు మోదీ సందేశం కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా భాజపా మండల అధ్యక్షుడు శ్రీనివాస్​రెడ్డి, జిల్లా కార్యదర్శి వెంకట్​రెడ్డి ఇంటింటికి ప్రచారం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన కార్యక్రమాలను వివరిస్తూ.. సందేశంతో కూడిన లేఖలను ఇంటింటికి పంచుతూ కేంద్ర పథకాలను వివరిచారు.

పౌరసత్వ సవరణ బిల్లు, అయోధ్యలో రామమందిర నిర్మాణం వంటి సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించిన ఘతన భాజపా ప్రభుత్వానికే దక్కిందని శ్రీనివాస్​ రెడ్డి పేర్కొన్నారు. రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి పెట్టుబడి పథకంలో భాగంగా దేశంలో 10 కోట్లకు పైగా రైతులకు రూ. 72వేల కోట్లు జమ చేసినట్లు వెల్లడించారు.

భాజపా ఏడాది పాలన-అభివృద్ధి

  1. 370 ఆర్టికల్​ను రద్దు చేసి, కశ్మీర్ ప్రజలకు విముక్తి కలిగించారు.
  2. ట్రిపుల్ తలాక్ బిల్లుతో ముస్లిం మహిళల కష్టాలను తొలగించారు.
  3. రామజన్మ భూమి సమస్య పరిష్కారించి, హిందువుల చిరకాల కోరిక తీర్చారు.
  4. రామమందిర్ నిర్మాణానికి పునాదులు వేశారు. సిఏఏ బిల్లు ద్వారా శరణార్థులకు పౌరసత్వం కల్పించారు.
  5. రైతు సమస్యను పరిష్కరించడంలో భాగంగా ఒకే దేశం - ఒకే మార్కెట్ పథకాన్ని ప్రకటించారు.
  6. పండించిన పంటను దేశంలో ఎక్కడైనా అమ్ముకునే విధంగా చట్టం చేశారు.
  7. ఆరోగ్య వ్యవస్థను బలపరచేందుకు నిధులు కేటాయించారు.
  8. కోవిడ్-19 వైరస్ నిర్మూలనకు ఆరోగ్య సేతు యాప్‌ ఆవిష్కరణ.
  9. రూ. 20 లక్షల కోట్లతో ఆత్మనిర్భర్, భారత్ అభియాన్ పథకం చేపట్టి దేశ ప్రజలందరికీ ప్రయోజనం పొందే విధంగా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: ఈనెల 16న కలెక్టర్లతో సీఎం కేసీఆర్​ సమావేశం

Last Updated : Jun 14, 2020, 7:46 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.