రంగారెడ్డి జిల్లా మేడిగడ్డ వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఐదుగురి మృతదేహాలను స్వగ్రామానికి తీసుకొచ్చారు. వరంగల్ మట్టెవాడ పోలీస్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ దుర్గాప్రసాద్, అతని భార్య విజయలక్ష్మి, చిన్న కుమారుడు శాంతన్, అక్క పద్మజ, బావ రాజు ఈ ప్రమాదంలో మృతి చెందారు. ఆస్ట్రేలియాలో ఉంటున్న దుర్గా ప్రసాద్ కుమారుడు శ్రీయాజ్, పద్మజ కుమారుడు నితిన్ ఈ రోజు ఉదయం కాజీపేటకు వచ్చారు. కుమారుల రాకతో వారి మృతదేహాలను గాంధీ ఆస్పత్రి నుంచి కాజీపేటకు తీసుకొచ్చారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, తాటికొండ రాజయ్య, నన్నపనేని నరేందర్, నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ విశ్వనాథ్ రవీంద్ర మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. బాధిత కుటుంబాలను అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
ఇవీ చూడండి: కేసీఆర్ సొంత గ్రామానికి రూ.10కోట్ల ప్రత్యేక నిధులు