వరంగల్ అర్బన్ జిల్లాలోని కుమ్మరి గూడెంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పర్యటించారు. గ్రామంలో సమస్యల గురించి ప్రజలను అడిగి తెలుసుకొన్నారు. సమస్యల పరిష్కారానికి నిబద్ధతతో పని చేయాలని అధికారులను ఆదేశించారు. అమృత్ పథకంలో భాగంగా రూ.50 లక్షల నిధులతో గ్రామంలో జరుగుతున్న వాటర్ గ్రిడ్ పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. రూ.30 లక్షల నిధులతో అంతర్గత సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాల పనులను చేపట్టామని వెల్లడించారు.
ఇవీ చూడండి: ఈ నెల 16నే నైరుతి రుతుపవనాల ఆగమనం