పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి, తెలంగాణ జన సమితి అభ్యర్థి కోదండరాం సూచించారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించి ఓటర్లను పలకరించారు.
హన్మకొండలో ప్రభుత్వ ఛీఫ్ విప్, ఎమ్మెల్యే వినయ భాస్కర్, ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వడ్డేపల్లిలోని పింగిలి మహిళా కళాశాలలో వినయభాస్కర్ ఓటు వేయగా, ఆర్ట్స్ కాలేజీలో రమేష్ ఓటు వేశారు.
ఇదీ చూడండి: ఓటేసేందుకు కదిలిన మహిళా లోకం..