వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని వడ్డెపల్లిలో నిరుపేదలకు ప్రభుత్వ ఛీప్ విప్ వినయ్ భాస్కర్ సరుకులను పంపిణీ చేశారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ పమేలా సత్పతితో కలిసి తిరుగుతూ ప్రజలకు కరోనాపై ఎమ్మెల్యే అవగాహన కల్పించారు.
ప్రతి ఒక్కరు విధిగా మాస్కు లు ధరించాలని వినయ్‌భాస్కర్ సూచించారు. అనంతరం నిరుపేదలకు నిత్యావసర సరుకులను అందజేశారు. లాక్డౌన్ పూర్తయ్యే వరకు ఇంట్లోనే ఉండి కరోనాను తరిమికొట్టాలని సూచించారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు.