ETV Bharat / state

వరదలపై అప్రమత్తత అవసరం: ఎమ్మెల్యే వినయ్​ భాస్కర్

author img

By

Published : Aug 15, 2020, 5:13 PM IST

వరుస వర్షాలతో జలమయమైన లోతట్టు ప్రాంతాల్లో ప్రభుత్వ చీఫ్ విప్​, వరంగల్​ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్​ భాస్కర్​ పర్యటించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అధైర్య పడవద్దని, ప్రభుత్వ యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటుందని ప్రజలకు ధైర్యం చెప్పారు.

mla vinay bhaskar visits in warangal city
లోతట్టు ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే వినయ్​ భాస్కర్

వరంగల్​ నగరంలో గత నాలుగురోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల జలమయమైన లోతట్టు ప్రాంతాల్లో ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే దాస్యం వినయ్​ భాస్కర్​ పర్యటించారు. హన్మకొండలోని నయీం నగర్​, అంబేడ్కర్​ నగర్​, ములుగు రోడ్, సమ్మయ్య నగర్​, టీవీ టవర్​ కాలనీ, పెద్దమ్మగడ్డతో సహా పలు ముంపు ప్రాంతాలను జిల్లా కలెక్టర్​ రాజీవ్​, స్థానిక అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలెవ్వరూ ఆందోళన చెందవద్దని, ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని, అన్ని వసతులు కల్పించి కాపాడుకుంటామని ఎమ్మెల్యే అన్నారు.

ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో కరోనా వ్యాపించకుండా మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరంగల్, హన్మకొండ నగరరాలు తడిసి ముద్దయ్యాయి. ములుగు రోడ్, నయీం నగర్ వద్ద వరద నీరు ప్రమాదకర స్థితిలో ప్రవహిస్తుంది. పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.

ఇవీ చూడండి: ఎర్రకోటపై మువ్వన్నెల జెండా రెపరెపలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.