ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు భౌతిక వ్యాయామంలో భాగంగా సైకిల్‌ను తొక్కాలని ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ కోరారు. ఇవాళ ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా ఆయన హన్మకొండలో యువకులు, చిన్నారులతో కలిసి సైకిల్‌పై ప్రయాణించారు.
సైకిల్ తొక్కడం వల్ల శారీరకంగా ఆరోగ్యంగా ఉండడమే కాకుండా… మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుందన్నారు. రోజువారీ కార్యకలాపాల కోసం బయటకు వస్తే సైకిల్‌ను అలవాటు చేసుకుంటే… ఇంధన పొదుపుతోపాటు పర్యావరణాన్ని కూడా కాపాడుకోవచ్చని తెలిపారు.
ఒకప్పుడు సైకిల్ నిత్యావసరంగా ఉండేదని... కానీ ఇప్పుడు అది ఇంట్లో అలంకరణగా మారిపోయిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రజలు ఇప్పటి నుంచైనా చిన్న చిన్న దూరాలకు బైక్‌ను వాడకుండా సైకిల్ మీద ప్రయాణించడానికి ముందుకు రావాలన్నారు. అందుకోసం నగరంలో అక్కడక్కడా సైకిల్ ట్రాక్‌లు కూడా ఏర్పాటు చేసినట్లు చీఫ్ విప్ తెలిపారు. వారంలో ఒకరోజు తాను కూడా సైకిల్‌ను వినియోగిస్తానని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: కొవిడ్ వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్న ఎంపీ రేవంత్ రెడ్డి