ప్రతి ఒక్కరు మొక్కలు నాటి.. పర్యావరణాన్ని కాపాడుకోవాలని ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా హసన్పర్తి మండలకేంద్రంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా ఓ ప్రైవేటు పాఠశాలలో మొక్కలు నాటారు. అనంతరం పిల్లలకు, వారి తల్లిదండ్రులకు 500 మొక్కలను పంపిణీ చేశారు. వర్షాలు ఎక్కువ కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే అందరూ మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతా తీసుకోవాలన్నారు.
ఇదీ చదవండిః హైకోర్టు జడ్జిపై సీబీఐ విచారణ.. దేశంలోనే తొలిసారి!