తెలంగాణ రాష్ట్రాన్ని పచ్చగా మార్చాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న హరితహారం కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ అన్నారు. హన్మకొండలోని వడ్డేపల్లిలో ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమంలో ఆయన పాల్గొని మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ తాము నాటిన మొక్కను సంరక్షించుకోవాలని సూచించారు.
ఇదీ చదవండిః గాంధీ ఆస్పత్రికి పోతే గజగజ వణకాల్సిందే