తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఆటో డ్రైవర్ల పాత్ర కీలకమైనదని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. ప్రపంచ ఆటోడ్రైవర్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం హన్మకొండలోని కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఆటో చోదకులకు ఎల్లవేళలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. డ్రైవర్ల సహకార సంస్థ ఏర్పాటు కోసం ఒక నెల జీతాన్ని విరాళంగా ఇస్తానని వాగ్దానం చేశారు. వరంగల్లో ఆటో భవన్కు శ్రీకారం చుడుతామన్నారు. డ్రైవర్లందరూ సమష్టిగా ఉండి ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని వినయ్ భాస్కర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ మేయర్ గుండా ప్రకాష్, ఛైర్మన్ మర్రి యాదవ రెడ్డి, జలవనరుల శాఖ ఛైర్మన్ ప్రకాశ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఇవీ చూడండి: మళ్లీ మొరాయించిన మెట్రో రైలు