అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తూ పార్టీ బలోపేతానికి తెరాస పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ పిలుపునిచ్చారు. వరంగల్ అర్బన్ జిల్లా హాసన్పర్తి మండల కేంద్రంలో పార్టీ కార్యకర్తలతో అరూరి రమేష్ సమావేశమయ్యారు. రానున్న కార్పొరేషన్, ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వారితో చర్చించారు.
ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తెరాస ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను ప్రజల్లోకి బలంగా తీసుకుపోవాలని కార్యకర్తలకు సూచించారు. రెండు, మూడు నెలల్లో మిగిలిపోయిన అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఏ ఎన్నికలు వచ్చిన గెలుపే లక్ష్యంగా కృషి చేయాలని కార్యకర్తలకు ఎమ్మెల్యే సూచించారు.
ఇదీ చూడండి: పెళ్లైన రెండునెలలకే చంపేశాడు.. ఆపై...