రాష్ట్ర ప్రభుత్వం అందించిన ఉచిత చేప పిల్లల పంపిణీ ద్వారా మత్స్యకారులు ఆత్మాభిమానంతో జీవిస్తున్నారని ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పేర్కొన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మండలం పంథిని గ్రామంలోని నాగుల చెరువులో చేప పిల్లలను విడుదల చేశారు.
రాష్ట్రంలో కుల వృత్తులను కాపాడేందుకు సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మత్స్యకారులకు రాయితీపై వాహనాలు, వలలు, తెప్పలు, ఇతర సామగ్రిని అందజేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో తెరాస అధికారంలో ఉన్నంత కాలం కుల వృత్తులను కాపాడుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
ఇదీచూడండి.. 'గల్లీ చిన్నదీ.. గరీబోల్ల కథ పెద్దది..': భట్టి