కరోనా వ్యాప్తి నివారణ కోసం ప్రజలు ఇంకొన్ని రోజులు సహకరించాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ విజ్ఞప్తి చేశారు. వరంగల్ అర్బన్ జిల్లా హసన్పర్తి మండలం భీమారంలో పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవలు మరువలేనివని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రాకుండా కరోనా కట్టడిలో భాగం కావాలని కోరారు.
ఇదీ చదవండి: కరోనా వేళ 'మూర్తీ'భవించిన మానవత్వం