వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మండలకేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, ఇన్ఛార్జిలతో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పట్టభద్రుల ఓటు నమోదు ప్రక్రియలో పార్టీ కార్యకర్తలు క్రియాశీలకంగా పనిచేయాలని సూచించారు.
పట్టభద్రులైన యువతకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించాలని ఎమ్మెల్యే వెల్లడించారు. మండలపరిధిలో గ్రామాల వారిగా పట్టభద్రుల జాబితా రూపొందించుకుని వారందరితో ఓటు నమోదు చేయించాలని సూచించారు. నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీ వచ్చేలా పార్టీ శ్రేణులు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఇదీ చదవండిః అమీన్‌పూర్ మారుతి హోం బాలిక మృతి కేసులో నివేదిక