వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మండలంలోని ముల్కలగూడెంను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ అన్నారు. ముల్కలగూడెంలో నూతనంగా ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్, శ్మశాన వాటిక, పబ్లిక్ టాయిలెట్స్‌ను ప్రారంభించారు. అనంతరం వాటర్ ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
తెరాస పాలనలోనే గ్రామాలు సమగ్రాభివృద్ధి చెందుతున్నాయన్నారు. సీఎం కేసీఆర్ సంకల్పం వల్లే గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత సాధ్యమైందని తెలిపారు.
ఇదీ చదవండి: మాకొచ్చిన కష్టం మరెవ్వరికీ రాకూడదు... నిందితుడిని వెంటనే శిక్షించాలి'