ETV Bharat / state

మిర్చి కొత్త రికార్డ్.. ఆ రకం క్వింటాల్ ధర రూ.32,500 - వండర్ హాట్ రకం

mirchi record rate: రాష్ట్రంలో మిర్చి ధర కొత్త రికార్డులను సృష్టిస్తోంది. తెలంగాణలోనే పెద్దదైన ఎనుమాముల మార్కెట్లో వండర్ హాట్ రకం క్వింటా 32వేలను దాటింది. ధర బాగున్నందున మిర్చి నిల్వ చేసుకున్న రైతులు అమ్ముకోవాలని మార్కెట్ అధికారులు సూచిస్తున్నారు.

mirchi record rate
mirchi record rate
author img

By

Published : Jul 19, 2022, 2:41 PM IST

mirchi record rate: వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ మిర్చి రైతులపై కాసుల వర్షం కురిపిస్తోంది. కొన్నాళ్లుగా మిర్చి ధరల పెరుగుతున్న కనిపిస్తున్నా.. ఇవాళ మాత్రం కొత్తపుంతలు తొక్కింది. ​ఏనుమాముల మార్కెట్లో తాజాగా వండర్ హాట్ రకం ఏకంగా 32వేల 500 గరిష్ట ధర నమోదు చేసింది. యూఎస్​ 341 రకం 29వేలు పలికింది. తేజ రకం 23వేల 500 రూపాయలకు చేరింది.

mirchi record rate
mirchi record rate

గత సీజన్లో శీతల గిడ్డంగుల్లో నిలువ చేసిన మిర్చికి గరిష్ఠ ధరలు దక్కాయని మార్కెట్ కార్యదర్శి రాహుల్ తెలిపారు. ఇదే అనువైన సమయమని... నిల్వ చేసుకున్న రైతులు సరుకు అమ్ముకుంటే మంచి లాభాలు వస్తాయని తెలిపారు. రాబోయే రోజుల్లో ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయన్నారు.

వండర్​ హాట్ ధర క్వింటాలుకు రూ.32వేల 500కు చేరింది. 1048 రకం మిర్చి రూ.25వేలు పలికింది. తేజ రకం రూ.23,500. ఈ రకాల మిర్చి మంచి ధర పలుకుతోంది. నిల్వ చేసుకున్న రైతులు అమ్ముకునేందుకు ఇది సరైన సమయం. రాహుల్ మార్కెట్, ఏనుమాముల మార్కెట్ కార్యదర్శి

ఇదీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.